తాడేపల్లి/అమరావతి : తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయించనున్నామని, మినరల్ లీజులో 50 శాతం మినహాయింపు ఇవ్వనున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లందరికీ ఆర్థికంగా మేలు కలిగేలా నూతన వడ్డెర్ల సొసైటీలు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వడ్డెర కార్పొరేషన్ మల్లె ఈశ్వరరావు ఆధ్వర్యంలో వడ్డెర సామాజిక వర్గీయులు కలిసి ధన్యవాదాలు తెలియ జేశారు. తమకు ఆర్థిక భరోసా కలిగించేలా మైనింగ్ లీజులు కేటాయింపులతో పాటు సినరేజీ మినహాయింపు ఇచ్చినందుకు ఆనందం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన ప్రతి హామీనీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయించామన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. మత్స్యకారులకు నష్టం కలిగిస్తున్న వివాదాస్పద 217 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు ఎస్. సవిత. చేనేతలకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామన్నారు. నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యలో నడిచే సెలూన్లకు ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచామన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచామన్నారు. బడ్జెట్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, రూ.51 వేల కోట్లుకు పైగా వారి అభ్యున్నతికి కేటాయించామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు గతంలో ఎప్పుడూ కేటాయించలేదని మంత్రి సవిత గుర్తు చేశారు.
The post నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Categories: