hyderabadupdates.com movies నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు ఇటు సినీ రంగంతో పాటు అటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీగా రెండుసార్లు గెలిచి వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజు ఆ పార్టీలో చాలాకాలం యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత తన భర్త అడుగుజాడల్లోనే నడిచిన బిజెపి తరఫున శ్యామల దేవి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస వర్మ తరఫున శ్యామలాదేవి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆమె బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

ఒక ఫంక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శ్యామలా దేవి కలిశారు. ఆ చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ తలపై చేయి పెట్టి ఆశీర్వదించిన శ్యామలా దేవి… రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశీర్వదించారు. నెక్స్ట్ అధికారం మనదే అంటూ ఆమె చేసిన కామెంట్లతో కేటీఆర్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఏది ఏమైనా… బిజెపికి మద్దతుగా నిలిచే శ్యామలా దేవి బీఆర్ఎస్ కు జై కొట్టడం ఇటు రాజకీయ, అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

View this post on Instagram

Related Post

Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth StoryApollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story

Under the leadership of Dr. Shobana Kamineni, Dr. Sangita Reddy, Upasana Konidela and Vishwajit Reddy, Apollo Hospitals has set in motion a transformational mission to uplift the health and well-being

H-1B టెక్కీలకు కంపెనీ వార్నింగ్.. ఇండియా వెళ్తే..H-1B టెక్కీలకు కంపెనీ వార్నింగ్.. ఇండియా వెళ్తే..

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటికే గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్చరించగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా తన H-1B ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్తే

I want to make a love story with Mahesh Babu says sensational young director
I want to make a love story with Mahesh Babu says sensational young director

Director Sai Marthand, who scored a blockbuster with Little Hearts, has become the talk of the town in Telugu cinema. The film, starring Mouli and Shivani Nagaram, turned out to