hyderabadupdates.com movies నేను చిక్కిపోయింది అందుకేరా నాయనా: లోకేశ్

నేను చిక్కిపోయింది అందుకేరా నాయనా: లోకేశ్

టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్ చేస్తున్నారని, వర్కవుట్స్ చేసి ఫిట్ నెస్ సాధించారని అందరూ అనుకుంటున్నారు. అయితే, తాను చిక్కిపోవడానికి కారణం వేరే ఉంది అంటున్నారు లోకేశ్.

తాను ప్రభుత్వంలో పని చేయాలని, అదే సమయంలో పార్టీలోనూ పనిచేయాలని కాబట్టే తాను చిక్కిపోయానని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకే సారి రెండు బాధ్యతలు చూసుకుంటున్న తన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని చెప్పారు.

ఇక, తెలుగు దేశం పార్టీ అనేది శాశ్వతం అని, ఒక వ్యవస్థ కింద అందరూ నడవాల్సిన అవసరముందని అన్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి మాట్లాడానని, రివ్యూ చేశారని తెలిపారు. బాబుగారితో పనిచేయడం కష్టమని, అంత తేలిక కాదని అన్నారు. ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు.

‘‘నేను ప్రభుత్వంలో పని చేయాలి…..పార్టీలో పనిచేయాలి..ఇంక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి.. అందరూ చిక్కిపోయావని అంటున్నారు…ఆ దెబ్బకే చిక్కిపోయారా నాయనా’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అయితే, చంద్రబాబుతో కలిసి పని చేయడం…ఆయన కింద పనిచేయడం ఒక తృప్తినిస్తుందని అన్నారు. అహర్నిశలు ఆయన ఛాలెంజ్ చేస్తారని …పని చేసే వారికే ఎక్కువ పని పెడతారని చెప్పారు.

Related Post

Suriya47 Update: Nazriya Nazim Fahadh joins Suriya starrer cop action film directed by Jithu MadhavanSuriya47 Update: Nazriya Nazim Fahadh joins Suriya starrer cop action film directed by Jithu Madhavan

For those unaware, Suriya had earlier announced his collaboration with Jithu Madhavan for the tentatively titled Suriya47. The upcoming action-comedy is said to feature the actor as an eccentric police