hyderabadupdates.com Gallery నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్

నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్

నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్ post thumbnail image

నేపాల్ : నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చెల‌రేగిన త‌రుణంలో నేపాల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ త‌రుణంలో దేశ ప్ర‌ధాన‌మంత్రిగా అతి పిన్న వ‌య‌సు క‌లిగిన బాలేంద్ర షా బాలెన్ కొలువు తీరారు. ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 35 ఏళ్లు మాత్ర‌మే. ఆయ‌న‌పై జ‌నం న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ప‌ట్టం క‌ట్టారు. త‌న‌పై బోలెడు ఆశ‌లు లేక పోలేదు. త‌ను వృత్తి ప‌రంగా ర్యాప‌ర్. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందాడు. కానీ ప్ర‌వృత్తి ప‌రంగా గాయ‌కుడి నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు బాలేంద్ర షా బాలెన్. మధేష్ ప్రాంతం నుండి మొదటి ప్రధానమంత్రి కూడా అయ్యారు. తాజాగా అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు బాలేంద్ర షా 15 నుండి 18 మంది మంత్రులతో కూడిన ఒక చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
శుక్ర‌వారం బాలేంద్ర షా బాలెన్ నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో ఈ హిమాల‌య దేశంలో అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడైన ఎన్నికైన నాయకుడిగా నిలిచారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన బాలెన్‌ను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (1) ప్రకారం రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ప్రధానమంత్రిగా నియమించారని రాష్ట్రపతి కార్యాలయం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా మధ్యాహ్నం 12.34 గంటలకు రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో కొత్తగా నియమితులైన ప్రధానమంత్రితో ప్ర‌మాణం చేయించారు. హింసాత్మక ‘Gen Z’ నిరసనల తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికలలో, నేపాల్ ప్రజలు సంప్రదాయ రాజకీయ పార్టీలను చిత్తుగా ఓడించారు బాలెన్ కు ప‌ట్టం క‌ట్టారు.
The post నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రూ. 1511 కోట్ల భూమి క‌బ్జా హైడ్రా ఫెన్సింగ్రూ. 1511 కోట్ల భూమి క‌బ్జా హైడ్రా ఫెన్సింగ్

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌లను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. పార్కులు, చెరువుల‌ను చెర‌ప‌ట్టిన వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒకే రోజు న‌గ‌రం న‌లువైపులా 4 చోట్ల భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించింది. వెనువెంట‌నే ఫెన్సింగ్ వేసింది. రెండు చోట్ల 1100ల

ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్

హైద‌రాబాద్ : టిజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మారుతి. అయితే ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా. పాన్ ఇండియా స్థాయిలో తీసినా ఆశించినంత

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌త 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అందుకే జ‌నం ఛీ కొట్టార‌ని,