hyderabadupdates.com movies న్యూజిలాండ్ లో ఒక్కడు… RCB ఫుల్ హ్యాపీ!

న్యూజిలాండ్ లో ఒక్కడు… RCB ఫుల్ హ్యాపీ!

నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించి 238 పరుగులు బాదినా, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ మాత్రం తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సిరీస్‌లో మొదటి విజయం భారత్‌దే అయినా, బౌలింగ్‌లో మాత్రం డఫీ తన మార్క్ చూపించాడు. కేవలం 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా, బ్యాటర్ల స్వర్గధామం లాంటి పిచ్‌పై కూడా తనేంటో నిరూపించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో డఫీ వేసిన స్పెల్ ఒక పక్కా ప్రణాళికతో సాగింది. అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు ఓవర్‌కు 12 నుంచి 15 పరుగులు పిండుకుంటున్న సమయంలోనూ, డఫీ కేవలం 6.80 ఎకానమీతో బౌలింగ్ చేయడం విశేషం. కివీస్ బౌలర్లలో జేమీసన్ (13.50 ఎకానమీ), ఇష్ సోధి (12.70 ఎకానమీ) భారీగా పరుగులు సమర్పించుకున్న చోట, డఫీ తన లైన్ అండ్ లెంగ్త్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేయగలిగాడు.

ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ ఈ ప్రదర్శనను చూసి కాలర్ ఎగరేస్తున్నారు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 2.00 కోట్లు పెట్టి డఫీని కొనుగోలు చేయడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న మైదానంలో పరుగులను నియంత్రించే బౌలర్ కోసం వెతుకుతున్న ఆర్సీబీకి డఫీ ఒక పక్కా సొల్యూషన్ లా కనిపిస్తున్నాడు.

సాధారణంగా భారత పిచ్‌లపై విదేశీ ఫాస్ట్ బౌలర్లు తడబడటం చూస్తుంటాం, కానీ డఫీ మాత్రం నాగ్‌పూర్ పిచ్‌ను పక్కాగా అర్థం చేసుకుని బౌలింగ్ చేశాడు. అతని వేరియేషన్లు, యార్కర్లు ఐపీఎల్‌లో ఆర్సీబీకి డెత్ ఓవర్లలో కీలక ఆయుధాలు కానున్నాయి. కైల్ జేమీసన్ లాంటి సీనియర్ బౌలర్ పరుగులిస్తున్నా డఫీ మాత్రం కంట్రోల్‌గా బౌలింగ్ చేశాడు.

న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, ఒక బౌలర్‌గా డఫీ మాత్రం విన్నర్‌గా నిలిచాడు. ఆర్సీబీ జెర్సీలో డఫీ తన ‘వైల్డ్’ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెడతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతని ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఐపీఎల్ 2026లో ఆర్సీబీ బౌలింగ్ విభాగానికి కొత్త కళ రావడం ఖాయం.

Related Post

The whole of India will be proud of us – Mahesh Babu about VaranasiThe whole of India will be proud of us – Mahesh Babu about Varanasi

Tollywood Superstar Mahesh Babu’s speech at the Globe Trotter event was short but impactful. Mahesh started off his speech by remembering his late father, the legendary Superstar Krishna’s words. “My

పాపం షర్మిల.. గ్రాఫ్ పెరగట్లేదట..!పాపం షర్మిల.. గ్రాఫ్ పెరగట్లేదట..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఈ పదవిని చేపట్టి 20 మాసాలు పూర్తయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల ఇప్పటి వరకు సాధించిందేంటి అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించడం లేదని