hyderabadupdates.com Gallery పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో

పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో

పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో post thumbnail image

ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో హాట్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ స‌త్తా చాటింది. త‌న తొలి మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆల్ రౌండ్ షోతో దుమ్ము రేపింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 3 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. మ్యాచ్ లో భాగంగా తొలుత మైదానంలోకి దిగింది గుజ‌రాత్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 163 ప‌రుగులే చేసింది. అనంత‌రం ల‌క్ష్యం చిన్న‌ది కావ‌డంతో 19.1 ఓవ‌ర్ల‌లోనే ప‌ని కానిచ్చేసింది. 7 వికెట్లు కోల్పోయి విక్ట‌రీ సాధించింది. ఇక ఈ లీగ్‌లో అరంగేట్ర మ్యాచ్‌ ఆడిన కూపర్‌ కనోలి అద్భుతంగా ఆడాడు. త‌ను 44 బంతులు ఎదుర్కొన్నాడు. 72 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 5 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. ప్ర‌భ్ మ‌న్ సింగ్ 24 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 4 సిక్సుల‌తో విరుచుకు ప‌డ్డాడు. 37 ర‌న్స్ చేశాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త‌న ప్లాన్ ఫ‌లించింది. మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 162 ర‌న్స్ చేసింది. గిల్ 39 ర‌న్స్ చేస్తే జోస్ బ‌ల్ట‌ర్ 38 ప‌రుగులు చేశాడు. మిగ‌తా ప్లేయ‌ర్లంతా చాప చుట్టేశారు. పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా అనంత‌రం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఆదిలోనే ప్రియార్ ఆర్య వికెట్ ను కోల్పోయింది. ప్ర‌భ్ సిమ్ర‌న్ , క‌నోలీ ఇద్ద‌రూ క‌లిసి గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఏకి పారేశారు. స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు.
The post పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త్అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త్

హ‌రారే : అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. జింబాబ్వే లోని హ‌రారే వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది. ఏకంగా 100 ప‌రుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది.

అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణంఅంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

తిరుపతి : తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ

Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !

    జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’విభాగంలో తెలంగాణ టాప్‌లో నిలిచి సత్తా