hyderabadupdates.com Gallery ప‌ద‌వుల కంటే ప్ర‌జల మ‌ధ్య ఉండ‌టం ఇష్టం

ప‌ద‌వుల కంటే ప్ర‌జల మ‌ధ్య ఉండ‌టం ఇష్టం

ప‌ద‌వుల కంటే ప్ర‌జల మ‌ధ్య ఉండ‌టం ఇష్టం post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు తాజాగా పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల్లో భాగంగా పోటీ చేసే ఎమ్మెల్యేల అభ్య‌ర్తుల జాబితాను ప్ర‌క‌టించింది. కానీ ఇందులో కె. అన్నామ‌లైకి చోటు ద‌క్కుతుంద‌ని అంతా భావించారు. కానీ ఆయ‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు పార్టీ హైక‌మాండ్. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో కె. అన్నామ‌లై స్పందించారు. త‌ను ఒక‌రి కోసం మార‌న‌ని అన‌నారు. కేవ‌లం ఎమ్మెల్యే లేదా ఎంపీ అనే హోదా కోసం నేను ఇక్కడికి రాలేద‌న్నారు. నా పేరుకు అతుక్కు పోయిన ‘IPS’ హోదానే నేను వదులుకున్నానని చెప్పారు.
కాబట్టి, మరొక హోదాతో నా పేరును అలంకరించు కోవడం కోసం నేను ఇక్కడ లేను అని స్ప‌ష్టం చేశారు కె. అన్నామ‌లై. ఏ నాయకుడికీ భజన చేయడం కోసమో, వారికి శాలువాలు కప్పి బుజ్జగించడం కోసమో నేను ఇక్క‌డ లేన‌ని కుండ బ‌ద్దలు కొట్టారు. ఒక ర‌కంగా పార్టీ హైక‌మాండ్ కు ఝ‌ల‌క్ కూడా ఇచ్చారు. తాను క‌ర్ణాట‌క‌లో ప‌ద‌విని వ‌దిలి వేసి ఇక్కడికి వచ్చింది తమిళనాడు యువత కోసం అని చెప్పారు. వారి మెరుగైన జీవితం కోసం అని ప్ర‌క‌టించారు. ఈ ఎన్నికల్లో, తమిళనాడు అంతటా అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం నా బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం, ఈ నెల 7వ తేదీ వరకు పుదుచ్చేరి కేరళలో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించిందని అన్నారు. 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు, తమిళనాడు అంతటా ఉన్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులందరి తరపున తాను ప్రచారం చేయాల్సి ఉందన్నారు.
The post ప‌ద‌వుల కంటే ప్ర‌జల మ‌ధ్య ఉండ‌టం ఇష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

హైద‌రాబాద్ : ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేక కొత్త దుకాణం మొద‌లు పెట్టారంటూ కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు

అభివృద్ధి నినాదం మాది అవినీతి చరిత్ర నీదిఅభివృద్ధి నినాదం మాది అవినీతి చరిత్ర నీది

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ అయ్యారు. హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి నినాదం మాదని, అవినీతి

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖకేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ