hyderabadupdates.com movies పరాశక్తి దర్శనం మనకు ఉండదా

పరాశక్తి దర్శనం మనకు ఉండదా

శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించిన పరాశక్తి జనవరి 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు 14 అనుకున్నారు కానీ జన నాయకుడు ప్రొడ్యూసర్లు థియేటర్లను లాక్ చేసే విధానంలో అనుసరిస్తున్న పద్ధతి వల్ల తాము నష్టపోతున్నామని గుర్తించి పరాశక్తి నిర్మాతలు ముందుకు వచ్చారనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది.

కేవలం ఒక్క రోజు గ్యాప్ కాబట్టి స్క్రీన్లను సమానంగా పంచే పద్దతి మీద ఒప్పందాలు జరుగుతున్నాయట. విజయ్ కు అయిదు రోజుల పాటు తిరుగు ఉండదని భావించిన అభిమానులకు పరాశక్తి ఇచ్చిన షాక్ కొంచెం గట్టిగానే తగిలేలా ఉంది.

ఇదిలా ఉండగా పరాశక్తి తెలుగు డబ్బింగ్ రిలీజ్ సమాంతరంగా ఉండకపోవచ్చని లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అన్నేసి సినిమాల మధ్య దీన్ని తీసుకొస్తే షోలు చాలాక, జనాలకు రీచ్ కాక దెబ్బ తినొచ్చని భావించి ఒకటి రెండు వారాలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

గతంలోనూ శివ కార్తికేయన్ కు ఇలాగే జరిగింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ, సైంధవ్ ఉన్న కారణంగా అయలన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయలేకపోయారు. తర్వాత రకరకాల కారణాల వల్ల థియేటర్ మోక్షం దక్కలేదు. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ లోనే సదరు అయలన్ దర్శనమిచ్చింది.

సో పరాశక్తి కనక తెలుగు రిలీజ్ డేట్ ఆలస్యం చేస్తే ఇలాంటి రిస్క్ లేకపోలేదు. అమరన్ నుంచి శివ కార్తికేయన్ కు మన దగ్గరా ఇమేజ్ వచ్చింది. మదరాసి డిజాస్టర్ అయినా సరే ఓపెనింగ్స్ డీసెంట్ గా వచ్చాయి. అందుకే పరాశక్తి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేయాలని అనుకున్నాడు.

కాకపోతే ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పరాశక్తి మనోళ్లకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. జివి ప్రకాష్ సంగీతం, హీరోయిన్ శ్రీలీల పాత్ర, రవి మోహన్ విలనిజం, అధర్వ మురళి క్యారెక్టర్ లాంటి ఆకర్షణలు ఇందులో చాలానే ఉన్నాయి.

Related Post

Nandamuri Balakrishna’s Historical Epic #NBK111 to Launch on this DateNandamuri Balakrishna’s Historical Epic #NBK111 to Launch on this Date

Nandamuri Balakrishna, known as the God of Masses, is ready to begin a new journey with his next big film #NBK111. After delivering back-to-back blockbusters, Balakrishna is now teaming up

వీసా రెన్యూవల్… మనోళ్లకు మరో బిగ్ షాక్!వీసా రెన్యూవల్… మనోళ్లకు మరో బిగ్ షాక్!

అమెరికాలో ఉద్యోగం చేస్తూ, వీసా రెన్యూవల్ కోసం ఇండియా వచ్చిన వారికి పెద్ద షాక్ తగిలింది. డిసెంబర్ 15 తర్వాత జరగాల్సిన వేలాది హెచ్ 1బి వీసా ఇంటర్వ్యూలను అమెరికా అధికారులు ఉన్నపళంగా రద్దు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న