hyderabadupdates.com movies పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ కు ఎంత గౌరవమో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ అనుబంధం కేవలం అన్నదమ్ముల మధ్యనే కాదు, ఆ ఇంటి కోడళ్లకు కూడా చిరు అంటే అంతే ఇష్టం అని లేటెస్ట్ గా పవన్ భార్య అన్నా కొణిదల పెట్టిన పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది. నిన్ననే ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన అన్నా మొదట భర్త పవన్ కళ్యాణ్ ఫొటో పోస్ట్ చేశారు. ఇప్పుడు అన్నయ్య అంటూ మెగా బ్రదర్స్ ఫొటోలను షేర్ చేయడం విశేషం.

ఇక దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ కుటుంబంలోకి అడుగుపెట్టిన అన్నా.. మెగా బ్రదర్స్ తో తనకున్న బాండింగ్ గురించి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ​తను ఈ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్తలో ఎవరిని ఎలా పిలవాలో తెలియక తన భర్త పవన్ కల్యాణ్ నే అడిగి తెలుసుకున్నానని అన్నా పేర్కొన్నారు. పవన్ తన అన్నయ్యలను ఎలా పిలుస్తారో, తను కూడా అలాగే పిలవడం మొదలుపెట్టారట. చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం అప్పట్లో మొదలైందని చెప్పుకొచ్చారు. 

మొదట్లో ఏదో పిలవాలి కాబట్టి జాగ్రత్తగా పిలిచినా, కాలక్రమేణా ఆ పిలుపు వెనుక ఉన్న అర్థం తనకి అర్థమైందని, ఇప్పుడు అది కేవలం ఒక మాట మాత్రమే కాదు.. తన ఫీలింగ్ అని అన్నా ఎంతో అద్భుతంగా వివరించారు. ​నిజానికి వరుసల ప్రకారం చూస్తే చిరంజీవి అన్నాకు బావగారు అవుతారు. ఆ విషయం తనకు తర్వాత తెలిసినా కూడా తన మనసు మాత్రం బావగారు అని పిలవడానికి ఇష్టపడలేదని ఆమె తెలిపారు. 

తనకు సొంత అన్నదమ్ములు లేరని, అందుకే జీవితం తనకు చిరంజీవి, నాగబాబు రూపంలో ఇద్దరు అన్నయ్యలను ప్రసాదించిందని ఆమె చాలా ఎమోషనల్ గా తన మనసులో మాటను బయటపెట్టారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఫోటోలో చిరంజీవి ఎంతో ఆప్యాయంగా అన్నా బుగ్గలు నిమురుతూ ఉండగా, పక్కనే పవన్ నవ్వుతూ కనిపిస్తున్నారు.

​ఈ ఫోటో చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఉండే ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బయట పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చేసరికి అన్నదమ్ములంతా ఒకటిగానే ఉంటారు. అన్నా లెజినోవా పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఒక విదేశీ వనిత అయి ఉండి కూడా మన తెలుగు ఇంటి సంస్కృతిని, అన్నయ్య అనే పిలుపులోని మాధుర్యాన్ని ఆమె అర్థం చేసుకున్న తీరును మెగా ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.

Related Post

Varanasi: Trailer of Rajamouli & Mahesh Babu’s film looks ambitious, interesting & grandVaranasi: Trailer of Rajamouli & Mahesh Babu’s film looks ambitious, interesting & grand

Rajamouli launched the trailer of his upcoming film ‘Varanasi’ at the grand event held at Ramoji Film City, Hyderabad. The film, led by Superstar Mahesh Babu, Priyanka Chopra, and Prithviraj

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయగా, వేలాది వాహనాలు రోడ్డుపైనే