hyderabadupdates.com movies పాడ్‌కాస్ట్ చేయబోతున్న మెగాస్టార్?

పాడ్‌కాస్ట్ చేయబోతున్న మెగాస్టార్?

గత కొన్నేళ్లలో పాడ్ కాస్ట్ కల్చర్ బాగా పెరిగింది. తమ మనసు విప్పడానికి, తీరిగ్గా కబుర్లు చెప్పడానికి సెలబ్రెటీలు వీటిని ఎంచుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పాడ్ కాస్ట్ కల్చర్ మొదలైన కొత్తలోనే దాన్ని అందిపుచ్చుకుని.. చెప్పిన కబుర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పాడ్ కాస్ట్ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం చిరు.. మీడియా మిత్రులను ఇంటికి పిలిపించి ముచ్చట్లు చెప్పారు.

ఈ సందర్భంగా పాడ్ కాస్ట్ మొదలుపెట్టే ఆలోచనను ఆయన పంచుకున్నారు. ఇందుకోసం చిరు కూతురు సుష్మిత, రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సినీ రంగంలో చిరుది నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం. మూడు తరాల నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి పని చేశారాయన. ఈ క్రమంలో ఎన్నో అద్భుతమైన అనుభవాలను మూటగట్టుకున్నారు. ఆయన మీడియాను కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం తక్కువ. ఇచ్చినా.. ఇప్పటి సినిమాల గురించే మాట్లాడతారు తప్పితే.. ఒకప్పటి ముచ్చట్లు చెప్పే అవకాశం, తీరిక రాదు.

అందుకే పాడ్ కాస్ట్ ద్వారా తనకు నచ్చిన విషయాలను, అనుభవాలను అభిమానులతో పంచుకోవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. బీవీఎస్ రవి.. బాలయ్యతో చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈయనే పాడ్ కాస్ట్ కాన్సెప్ట్‌ను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు.. యాంకర్ సుమతో ఇలా తన అనుభవాలను పంచుకునే టీవీ ప్రోగ్రాం చేశారు. అది ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. చిరు పాడ్ కాస్ట్ చేస్తే దాన్ని మించి గొప్ప స్పందన తెచ్చుకునే అవకాశముంది.

Related Post

OTT Review: Karthi’s Annagaru Vostaru – Telugu Movie streaming on Prime VideoOTT Review: Karthi’s Annagaru Vostaru – Telugu Movie streaming on Prime Video

Movie Name :  Annagaru Vostaru Streaming Date : Jan 28, 2026 Streaming Platform : Amazon Prime Video 123telugu.com Rating : 2.5/5 Starring : Karthi, Krithi Shetty, Sathyaraj, Rajkiran, Anand Raj,

అవతార్-3 రివ్యూలు వచ్చేశాయ్అవతార్-3 రివ్యూలు వచ్చేశాయ్

2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా నాలుగు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్. అందులో తొలి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్