hyderabadupdates.com Gallery పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్

పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్

హైద‌రాబాద్ : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో కీలకంగా భావిస్తున్న పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుండి కొకెయిన్ తెప్పించినట్లుగా.. తానేవెళ్లి తీసుకువచ్చినట్లుగా విచారణలో పోలీసులకు చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి సహాయకుడు, డ్రైవర్ సిల్వేరి శరత్ కుమార్ కీల‌కంగా ఉన్నారు.
సిమ్లా నుండి తానే డ్రగ్స్ తీసుకు వచ్చినట్లుగా పోలీసులను తప్పుదోవ పట్టించాడు రోహిత్ స్నేహితుడు బెంగళూరు వ్యాపారి కౌశిక్ రవి.
డ్రైవర్ శరత్ చెప్పిన వివరాల ఆధారంగా అభిషేక్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించుకున్నారు పోలీసులు. గత నాలుగు రోజులుగా అభిషేక్ గురించి వెతుకుతున్నారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా అభిషేక్ ఆచూకీ కనుగొన్న సిట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా డ్ర‌గ్స్ కేసులో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురికి డ్ర‌గ్స్ పరీక్ష‌ల్లో పాజిటివ్ వ‌చ్చిందని తేల్చారు. ఈ కేసులో స్టేష‌న్ బెయిల్ ఇచ్చారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాద‌వ్. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. త‌న‌ను కోర్టు ముందు హాజ‌రు ప‌ర్చ‌డంతో రిమాండ్ విధించారు.
గ‌తంలో కూడా డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నారు మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి. గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో ఫామ్ హ‌జ్ ల‌లో డ్ర‌గ్స్ దందాల కొన‌సాగుతూ వ‌చ్చాయి.
The post పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు

Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరిNara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

    ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు