hyderabadupdates.com Gallery పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు

పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు

పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు post thumbnail image

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిపాలించ‌డం చేత కావ‌డం లేద‌న్నారు. ఐఎస్ఐ, ఐపీఎస్ లను పూటపూటకు మార్చడం వలన పాలన కుంటు పడుతుందన్నారు. ఒక్క సంవత్సరంలో 5 సార్లు బదిలీలు చేశారని ఇదేం పాల‌న అంటూ ఎద్దేవా చేశారు. యావరేజ్ గా చూస్తే 6 నుండి 8 నెలలకు ఒక్క హెచ్ఓడి మారాడ‌న్నారు. అత్యంత కీలకమైన విద్యుత్ రంగం చూస్తే 5 అధికారులు మారడం విచిత్రం అన్నారు హ‌రీశ్ రావు. అందుకే విద్యుత్ శాఖ ఆగమాగం అవుతుందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అధికారుల‌ను స్థిరంగా ఉండ‌నీయ‌కుండా ప‌దే ప‌దే బదిలీ చేయ‌డం వ‌ల్ల విద్యుత్ శాఖ అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఆ శాఖను అర్ధం చేసుకునే లోపే బదిలీ అవుతున్నారని పేర్కొన్నారు హ‌రీశ్ రావు. సింగరేణి సంస్థలో కూడా 4 మారారని గుర్తు చేశారు. ఇక కీల‌క‌మైన హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ లో కూడా ఇదే ప‌రిస్థితి దాపురించింద‌న్నారు. ఐ అండ్ పీఆర్ లో కూడా 4 అధికారులు మారారని, అందుకే ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల‌కు ఆక్రిడిషన్ కార్డులు కూడా రావడం లేదన్నారు. విద్యాశాఖ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ముగ్గురు అధికారుల బదిలీలు అయ్యాయ‌ని తెలిపారు. ఆరోగ్య శ్రీలో 8 అధికారులు బదిలీలు అయ్యారని, పేదలకు ఏం వైద్యం అందిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇక రంగారెడ్డి జిల్లా విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు క‌లెక్ట‌ర్లు మారార‌ని తెలిపారు.
The post పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందుSuper Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు

    కార్తీక పౌర్ణమి వేళ… ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్ ఏర్పడింది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు

50 మందిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తెచ్చిన‌ డీఆర్ ఎఫ్‌50 మందిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తెచ్చిన‌ డీఆర్ ఎఫ్‌

హైద‌రాబాద్ : పెను ప్ర‌మాదాన్ని హైడ్రా త‌ప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ ద్వ‌రా మంట‌ల‌ను క్ష‌ణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న‌50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. అమీర్‌పేట‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీల‌గిరి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ కేబుళ్లున్న ప్యాన‌ల్

యువ ఆప‌ద మిత్రుల శిక్ష‌ణ‌ను విస్త‌రిస్తాంయువ ఆప‌ద మిత్రుల శిక్ష‌ణ‌ను విస్త‌రిస్తాం

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు త‌క్ష‌ణ‌మే సాయం అందించి ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆప‌ద మిత్ర‌ శిక్ష‌ణ‌ను జిల్లా, గ్రామ స్థాయికి విస్త‌రిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్