hyderabadupdates.com movies పుష్పరాజుకు జపాన్ పై పట్టు రాలేదా?

పుష్పరాజుకు జపాన్ పై పట్టు రాలేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన బన్నీ, ఇప్పుడు అదే సినిమాను జపాన్ ఆడియన్స్ ముందుకు కూడా తీసుకెళ్లారు. జపాన్ లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో భారీ ఎత్తున ప్రమోషన్లు చేసి, స్వయంగా అక్కడికి వెళ్లి మరి సందడి చేశారు. అయితే, అక్కడి ఓపెనింగ్స్ రిపోర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి మార్కెట్ ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అక్కడి ఆడియన్స్ మన కమర్షియల్ బొమ్మలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ అక్కడ రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ భావించారు. కానీ, మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే, ఇతర టాలీవుడ్ పెద్ద సినిమాల కంటే తక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

జపాన్ పర్యటనలో బన్నీ జపనీస్ భాషలో డైలాగులు చెప్పి అక్కడి ఫ్యాన్స్ ని ఖుషీ చేసినా, అది టికెట్ సేల్స్ కి ఎంతవరకు హెల్ప్ అయిందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఫుట్ ఫాల్స్ పరంగా చూస్తే, గతంలో విడుదలైన కొన్ని తెలుగు, హిందీ సినిమాల కంటే ఇది వెనుకబడి ఉన్నట్లు టాక్. భారీ స్థాయిలో 250 థియేటర్లలో రిలీజ్ చేసినా, ఆశించిన స్థాయిలో జనం రాలేదనే వార్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కొంచెం షాక్ ఇస్తున్నాయి.

అయితే, జపాన్ బాక్సాఫీస్ ట్రెండ్ మనకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ సినిమాలకు ఓపెనింగ్స్ కంటే లాంగ్ రన్, మౌత్ టాక్ చాలా ముఖ్యం. ఆర్ఆర్ఆర్ కూడా అక్కడ మెల్లగా పికప్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సో, ఇప్పుడున్న నంబర్స్ ని బట్టి పుష్ప రిజల్ట్ ని డిసైడ్ చేయలేము. వీకెండ్ ముగిసేలోపు అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ గనుక కనెక్ట్ అయితే, సీన్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఏదేమైనా, ఒక కమర్షియల్ తెలుగు సినిమా ఇంత పెద్ద ఎత్తున జపాన్ మార్కెట్ లో అడుగుపెట్టడం అనేది గొప్ప విషయమే. బన్నీ టీమ్ చేసిన ప్రమోషన్స్ వల్ల సినిమాపై అక్కడి లోకల్ జర్నలిస్టులలో, మూవీ లవర్స్ లో మంచి అవగాహన అయితే వచ్చింది. మరి రాబోయే రోజుల్లో ‘పుష్ప కున్రిన్’ అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. బన్నీ తగ్గుతాడా లేక మళ్ళీ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తాడా అనేది వెయిట్ అండ్ సీ.

Related Post

Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thrillerIsha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller

The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The makers recently unveiled an thrilling