hyderabadupdates.com Gallery పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు post thumbnail image

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలిపారు. త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడిగా గుర్తింపు పొందిన విజ‌య్ సేతుప‌తి త‌న కెరీర్ లో తొలిసారిగా తెలుగు సినిమాలో హీరోగా చేస్తుండ‌డం విశేషం. స్ల‌మ్ డాగ్ అని టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు పూరీ జ‌గ‌న్నాథ్. మురికివాడల నుండి ఎవరూ ఆపలేని తుఫాను ఒకటి ఉద్భవిస్తుంది అంటూ ఓ అంద‌మైన క్యాప్ష‌న్ కూడా జోడించాడు ద‌ర్శ‌కుడు. స్వ‌త‌హాగా భావుకుడు, ర‌చ‌యిత‌గా , ద‌ర్శ‌కుడిగా, ఆలోచ‌నా ప‌రుడిగా గుర్తింపు పొందాడు.
ఇప్ప‌టికే టాప్ హీరోస్ తో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది పూరీ జ‌గ‌న్నాథ్ కు. ప్ర‌త్యేకించి సినిమా టైటిళ్లు డిఫ‌రెంట్ గా ఉంటాయి. త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ , ప్ర‌భాస్ , విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీశాడు. తాజాగా సేతుప‌తితో ప్లాన్ చేశాడు. ప్ర‌స్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడైన విజ‌య్ తో జ‌త‌క‌ట్టారు. మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు అధికారికంగా టైటిల్‌ను కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం. విజయ్ సేతుపతి రక్తంతో తడిసిన ఆయుధాన్ని పట్టుకుని ఉన్న పోస్ట‌ర్ లుక్ అదిరేలా ఉంది. ఇప్ప‌టి దాకా చేసిన పాత్ర‌ల‌కంటే మ‌రింత భిన్న‌మైన పాత్ర‌కు ఎంపిక చేశాడు ద‌ర్శ‌కుడు.
The post పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

సెరియా : ప్ర‌పంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపుల‌ర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జ‌కోవిచ్. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మ‌రో రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్

నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాంనీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం

హైద‌రాబాద్ : ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయి. జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాల వ‌ర‌కూ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందస్తు హెచ్చ‌రిక చేశారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేలుకొందామ‌ని అన్నారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు