hyderabadupdates.com movies పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 40% చమురు గల్ఫ్ దేశాల నుంచి రావాలి. ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్ ఆ దేశంతో చర్చలు జరిపి హోర్మోజ్ జల సంధిని తెరవాలని తమను కూడా అనుమతించాలని కోరుతున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం ఈ యుద్ధాన్ని ఆపితే తప్ప జ‌ల‌సంధిని తెరిచే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.

అంతేకాదు జ‌ల‌సంధిపై తమకు మాత్రమే ఆదిపత్యం ఉంటుందని ఇరాన్ స్ప‌ష్టం చేసింది. అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కూడా ఇరాన్ తాజా చర్చల్లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఇది ఇరుపక్షాల మధ్య చర్చల ప్రతిష్టంభ‌నుకు దారి తీసింది. దీని ఫలితం ఏమిటి అంటే.. ఇతర దేశాల నౌకలను కూడా జల సంధి గుండా రానిచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది. అంతేకాదు జల సంధిలో తమ ఆధిపత్యం కోసం తమ అధికార కోసం నౌకలను నిలిపివేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

ఇది మరిన్ని వివాదాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇది ఒక భాగమైతే.. మరొకవైపు లేబ‌నాన్‌పై ఇజ్రాయిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ దాడులను కూడా ఆపాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఈ అంశాలన్నీ ఆయా దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలను కూడా సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి దాపురించింది. చ‌మురు సరఫరా నిలిచిపోయి ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా నాటో దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి.

ఉపాధి, ఉద్యోగ రంగాలు తీవ్ర స్థాయిలో ప్రభావితం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయినప్పటికీ అమెరికా తన పట్టును సడలించుకునే ప్రయత్నంలో కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో మరింతగా ఈ యుద్ధం పెరిగి పెను సంక్షోభం దిశగా ప్రపంచం నడిచే అవకాశం ఉందన్నది అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న మాట. అయితే ఇతర దేశాల నుంచి సరఫరా చేసుకునేందుకు అవకాశం ఉంది కదా అనే సందేహం రావచ్చు.

కానీ ఇతర దేశాల నుంచి చమురు ఉత్పత్తి.. అదేవిధంగా చమురు రవాణా వంటివి అత్యంత ఖరీదుతో కూడుకున్నవి. దీని వల్ల ప్రజలపై అత్యధిక భారాలను మోపాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ క్రమంలో ఇరాన్ -అమెరికా దేశాల మధ్య శాంతి నెలకొనాలని మెజారిటీ దేశాలు కోరుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

ఈ యుద్ధం గనక ముదిరితే అంటే ముఖ్యంగా ఇరాన్ నుంచి ఒక్క నౌకను కూడా బయటికి రాకుండా ట్రంప్ నిలువరించే ప్రయత్నం కనుక చేస్తే కచ్చితంగా అది ప్రపంచంలో పెను సంక్షోభానికి దారితీస్తుంది అన్నది పరిశీలకులు భావిస్తున్నారు.

Related Post

భలే ఐడియా – ఫ్రీ బస్సులాగా ఫ్రీ సినిమా టికెట్లుభలే ఐడియా – ఫ్రీ బస్సులాగా ఫ్రీ సినిమా టికెట్లు

మార్కెటింగ్ చేయడానికి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా చేయడంలో చిన్న నిర్మాతలు అనుసరిస్తున్న ఎత్తుగడలు మాములుగా లేవు. గత వారం విడుదలై సంచలన విజయ అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి వీక్ డేస్

Legend Returns: Singeetam Srinivasa Rao’s New Film Sparks Massive BuzzLegend Returns: Singeetam Srinivasa Rao’s New Film Sparks Massive Buzz

The legendary filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of Indian cinema’s most timeless classics, is all set to return with an ambitious new project that has already created