hyderabadupdates.com Gallery పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్

పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్

పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏజ్ పెరిగినా ఇంకా డిమాండ్ ఉన్న న‌టుల‌లో మెగాస్టార్ చిరంజీవి కాగా మ‌రొక‌రు విక్ట‌రీ వెంక‌టేశ్. ఈ ఇద్ద‌రూ క‌లిసి తాజాగా న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊహించని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. వ‌రుస సినిమాలు విజ‌య‌వంతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన తొమ్మిది సినిమాలు స‌క్సెస్ అయ్యాయి. ప్ర‌తి ఒక్క‌రిని ఈర్ష్య ప‌డేలా చేశాయి. వ‌రుస విజ‌యాల‌తో నిర్మాత‌లు పెద్ద ఎత్తున ద‌ర్శ‌కుడి అపాయింట్ మెంట్ కోసం క్యూ క‌డుతున్నారు.
దీంతో విక్ట‌రీ వెంక‌టేశ్ త‌న పారితోష‌కాన్ని పెంచేసిన‌ట్లు పెద్ద ఎత్తున టాక్. గ‌త కొంత కాలంగా రూ. 12 కోట్లు ప్ర‌తి సినిమాకు రెమ్యూన‌రేష‌న్ కింద తీసుకుంటున్నాడు. తాజాగా త‌న చివ‌రి రెండు మూవీస్ సంక్రాంతికి వ‌స్తున్నాం, మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో మ‌రింత పారితోష‌కాన్ని రెట్టింపు వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం త‌ను న‌టించాలంటే రూ. 22 కోట్లు ఇవ్వాలంటూ కండీష‌న్ పెడుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా త‌న సినీ కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ చేసిన మూవీగా నిలిచింది సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ. దీనికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు అనిల్ రావిపూడి.
The post పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డినారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డి

చిత్తూరు జిల్లా : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు సంక్రాంతి పండుగ వేళ తీపి క‌బురు ల‌భించింది. ఆయ‌న‌పై మోపిన అభియోగం, ఏపీ స్కిల్ డెవ‌లప్మెంట్ స్కాం కేసులో గ‌తంలో 50 రోజుల పాటు జైలు జీవితం గ‌డిపారు. ఆ

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేతUttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand : శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది