hyderabadupdates.com Gallery పైల‌ట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం

పైల‌ట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం

పైల‌ట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం post thumbnail image

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఈ ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డికి చెందిన‌ది కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ డ్ర‌గ్స్ పార్టీ చోటు చేసుకుంద‌ని, ఇందులో ఏపీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ఎనిమిది మంది డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసి సోదాలకు వెళ్లింది ఈగల్ టీమ్. పోలీసులను చూసి ఫైర్ ఓపెన్ చేసిన పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు. వీరి నుంచి రివాల్వ‌ర్, బుల్లెట్ల తో పాటు కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో రాజ‌కీయ పార్టీకి చెందిన నేత‌లు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.
ఈ డ్ర‌గ్స్ పార్టీలో ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఎనమిది మంది వీఐపీల‌ను కూడా అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా ఈగ‌ల్ టీం దాడి చేస్తున్న స‌మ‌యంలో ముందుగా గుర్తించిన పార్టీ చేసుకుంటున్న వ్య‌క్తులు విచ‌క్ష‌ణా ర‌హితంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు స‌మాచారం. తాజాగా వెల్ల‌డైన స‌మాచారం మేర‌కు ఏలూరు ఎంపీతో పాటు రాజ‌స్తాన్ కు చెందిన ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌నేని విజ‌య కృష్ణ‌, శ్ర‌వ‌ణ్ కుమార్, రితేష్ రెడ్డి ఉన్నారు. ఇదే స‌మ‌యంలో రోహిత్ రెడ్డి పీఏ పట్టుబడిన వెంటనే తన ఫోన్ ని పగల కొట్టాడు. ఇతను గతంలో లో డ్రగ్స్ లో అడ్డంగా దొరికి పోయిన సంగతి విదితమే.
The post పైల‌ట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతుల‌కు భ‌రోసామద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతుల‌కు భ‌రోసా

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెట్ యార్డులు, రైతు బజార్లు, లింకు రోడ్ల అభివృద్ధి కోసం ఏంఎంసీల‌ ఆదాయం సరిపోక మార్కెట్ సెస్‌ను వరిపై