hyderabadupdates.com Gallery పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పూర్తి పార‌దర్శ‌క‌తో పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామ‌న్నారు. భవిష్యత్ లో ఎవరూ ప్రజల భూమిపై కన్ను వేయకుండా భద్రత కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ ఉంటుందన్నారు. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు అని చెప్పారు సీఎం. మీ పాసు పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో వచ్చే మ్యాప్ మిమ్మల్ని నేరుగా మీ పొలం వద్దకు తీసుకు వెళుతుందని అన్నారు. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ లాంటి పటిష్ట వ్యవస్థను తెస్తున్నాం అని ప్ర‌క‌టించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే చేస్తున్నాం అన్నారు చంద్ర‌బాబు నాయుడు.
ముందుగా డ్రాఫ్ట్ పట్టా దార్ పాస్‌బుక్ జారీ చేసి అందులో వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేవో భూ యజమానులు నిర్ధారించుకునే అవకాశం ఇచ్చాం అని తెలిపారు. ఈ కేవైసీ ధృవీకరణ తప్పనిసరిగా తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. దీంతో తప్పులు దొర్లేందుకు వీలుపడదని అన్నారు. పైసా అవినీతి లేకుండా పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నాం అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో ముందుగా పంపిణీ చేపట్టాం అని చెప్పారు సీఎం. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. కలుగట్ల గ్రామంలో 1,178 కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకూ 37 లక్షల 40 వేల పట్టా దారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయ‌ని తెలిపారు.
ఇందులో 19 లక్షలు లక్షలు ఇప్పటికే పంపిణీ చేయగా..18 లక్షల 40 వేలు ఏప్రిల్ లోగా పంపిణీ చేస్తాం. ఇది కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంద‌న్నారు. అవి చేస్తే 60 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం వస్తుంద‌న్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. జాయింట్ ఎల్పీఎంల విషయంలో వివాదాలు పరిష్కరించు కోవాలని సూచించారు. ఈ కార్య‌క్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, ఎంపీ నాగరాజు, స్థానిక ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.

కేరళ సీఎం రేసులో నేను లేను : శ‌శి థ‌రూర్కేరళ సీఎం రేసులో నేను లేను : శ‌శి థ‌రూర్

కేర‌ళ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కేర‌ళ రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోంద‌ని, అయితే సీఎం ఎవ‌రు అవుతార‌నే

Upendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలుUpendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న ఘటనలను ఉద్దేశ్యించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు.