hyderabadupdates.com Gallery ‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్

‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్

‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్ post thumbnail image

ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ పై అజేయ‌మైన శ‌త‌కంతో విరుచుక‌ప‌డ్డాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది సీఎస్కే. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 207 ర‌న్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా త‌డ‌బాటుకు గురి కాకుండా సంజు శాంస‌న్ అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డాడు. త‌న జ‌ట్టుకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ ను ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందు ఉంచాడు. త‌ను కేవ‌లం 54 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 101 ర‌న్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు , 6 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా కేవ‌లం ఫోర్లు , సిక్స‌ర్ల ద్వారా 76 ర‌న్స్ చేయ‌డం విశేషం.
అనంత‌రం 208 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముండై ఇండియ‌న్స్ చెన్న సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ల ధాటికి, స్పిన్ మాయ‌జాలానికి త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఘోరంగా 103 ప‌రుగుల తేడాతో పరాజ‌యం పాలైంది. సూర్య కుమార్ యాద‌వ్ 35 ర‌న్స్ చేస్తే తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 37 ప‌రుగుల‌తో నిరాశ ప‌రిచారు. ఆ త‌ర్వాత ఏ ఒక్క‌రూ సింగిల్ స్కోర్ కూడా చేయ‌లేక పోయారు. అకీల్ హుసేన్ 17 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు తీస్తే నూర్ అహ్మ‌ద్ 24 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ సంద‌ర్బంగా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు సంజూ శాంస‌న్. మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు త‌న భార్య గురించి.
ఈ అవార్డు కేవలం ఒక సంఖ్య మాత్రమే, కానీ దీనిని చేరుకోవడానికి చాలా సుదీర్ఘ ప్రయాణం పట్టింది. ఈ ప్రత్యేక క్షణాన్ని నా భార్య చారుకు అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కొన్ని రోజులు నేను శూన్యంగా, నిరాశగా భావించాను, ఒక చెడ్డ ఆట తర్వాత నన్ను నేను సందేహించుకున్నాను, కానీ ఆమె ఎప్పుడూ అలా చేయలేదు. ఆమె నాలోని మంచి చెడులను చూసింది, అయినా కూడా నాకు అండగా బలంగా నిలిచింది. నన్ను నవ్విస్తూ, సంతోషంగా ఉంచినందుకు, నేను నన్ను నమ్మనప్పుడు కూడా నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. పొండట్టి, ఇది నీ కోసమే అంటూ తెలిపాడు.
The post ‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

సెరియా : ప్ర‌పంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపుల‌ర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జ‌కోవిచ్. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మ‌రో రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్

టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదుటీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు

చెన్నై : అస‌లైన కాంగ్రెస్ పార్టీ త‌మ‌తోనే ఉందంటూ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ పై నిప్పులు చెరిగారు కర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వంAP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం (AP Government) కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి