hyderabadupdates.com Gallery పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్

పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్

పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్ post thumbnail image

ముంబై : డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2026లో మ‌రోసారి ఛాంపియ‌న్ గా నిలిచేందుకు రెడీ అయ్యింది. ర‌జిత్ పాటిదార్ సార‌థ్యంలోని ఆర్సీబీ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. తాజాగా ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును త‌మ స్వంత గ‌డ్డ‌పై మ‌ట్టి క‌రిపించింది. 18 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. అంత‌కు ముందు బాలీవుడ్ కు చెందిన దిగ్గ‌జ గాయ‌ని ఆశా బోంస్లే క‌న్ను మూశారు. ఇవాళ ఆమెకు అంత్య‌క్రియ‌లు అధికారికంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించి మ్యాచ్ లో ఆడారు. ఇక ఆట విష‌యానికి వ‌స్తే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు.
ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ ముంబై బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసింది. గ‌త కొన్ని మ్యాచ్ ల‌లో అంత‌గా రాణించ‌ని ఫిల్ సాల్ట్ ఈసారి రెచ్చి పోయాడు. కేవ‌లం 36 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 78 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. మ‌రో వైపు విరాట్ కోహ్లీ 38 బంతులు ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 240 ర‌న్స్ చేసింది. అనంత‌రం భార టార్గెట్ ను ఛేదించేందుకు మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ 5 వికెట్లు కోల్పోయి 222 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది.
The post పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి ఉపాధి క‌ల్పించాలిపారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి ఉపాధి క‌ల్పించాలి

అమరావతి : యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల‌ని, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు

సినీ దిగ్గ‌జాలకు అవార్డులు ఇవ్వ‌డం భేష్సినీ దిగ్గ‌జాలకు అవార్డులు ఇవ్వ‌డం భేష్

హైద‌రాబాద్ : తెలుగు సినిమాలు పరిమాణానికి, ఆత్మకు మధ్య సమతుల్యతను పాటిస్తాయని అన్నారు ప్ర‌ముఖ న‌టి మాధురీ దీక్షిత్.ఈ గౌరవానికి గాను ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా దిగ్గజాలు, ఐకాన్‌ల మధ్య ఇక్కడ ఉండటం