hyderabadupdates.com movies ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన పాలన. అదే పని చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి డ్రైనేజీ, చెత్త సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులను విని, వెంటనే పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టం చేశారు.

పిఠాపురంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం కాని డ్రైనేజీ ప్రజల జీవనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నన్ను చీపురు పట్టుకుని రోడ్లు తుడవమంటారా?” అన్న ఆయన మాటలు అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించాయి.

ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని పవన్ స్పష్టం చేశారు. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా ఏర్పాటు చేసినా, పనులు వేగంగా జరగకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు.

తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని పవన్ హెచ్చరించారు.

Related Post

USA bookings open for Megastar Chiranjeevi’s Mana Shankara Varaprasad GaruUSA bookings open for Megastar Chiranjeevi’s Mana Shankara Varaprasad Garu

Megastar Chiranjeevi’s highly anticipated wholesome family entertainer Mana Shankara Vara Prasad Garu directed by Anil Ravipudi is all set for a worldwide theatrical release on January 12. The movie has

సోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయంసోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయం

యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతాం, ఏ వీడియో పడితే అది అప్‌లోడ్ చేస్తాం అంటే ఇక కుదరదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌పై ఒక కన్నేసి ఉంచేందుకు కొత్త చట్టాలు రాబోతున్నాయి. యూజర్ జనరేటెడ్ కంటెంట్‌పై