hyderabadupdates.com Gallery ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్

ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్

ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్ post thumbnail image

తాడేప‌ల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా వేదిక‌గా కొన్నేళ్లుగా స్వ‌చ్చందంగా , నిస్వార్థంగా సేవ‌లు అంద‌జేస్తూ వ‌స్తోంది రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (RDT). అయితే ఈ సంస్థ‌కి FCRA పర్మిషన్లను కేంద్ర స‌ర్కార్ నిలిపి వేసింది. జ‌గ‌న్ ఈ విష‌యాన్ని కేంద్ర స‌ర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయ‌న పార్టీకి చెందిన ఎంపీలు సైతం పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా త‌న విన్న‌పాన్ని మ‌న్నించి కేంద్రం రెన్యువల్‌ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి ధన్యవాదాలు తెలియ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాని, RDTకి FCRA అనుమతుల విషయంలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. నిజంగా ఆయన కృషిచేసి ఉంటే, ఏప్రిల్‌ 21, 2025లో నిలిచి పోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాది కాలం ఎందుకు పట్టింది అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు పట్టించుకోక పోవడంవల్లే వైయస్సార్‌సీపీ సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా? అని నిల‌దీశారు.
The post ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిసంజు శాంస‌న్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అజింక్యా ర‌హానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి. తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో స‌త్తా చాటాడు.

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలుDK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

    బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు.

పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కు కేటీఆర్ వార్నింగ్పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కు కేటీఆర్ వార్నింగ్

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వార ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు బయట ఉండేవాళ్లా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిప‌డ్డారు. ఒళ్లు దగ్గర