hyderabadupdates.com movies ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ చేపట్టారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరం స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తి కర పరిణామం జరిగింది. వందేమాతరం రూపకర్త బంకిమ్ చంద్ర ఛటర్జీని పలుమార్లు ప్రధాని మోదీ.. బంకిమ్ దా అంటూ సంబోధించారు. దీనిపై సభలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం చెప్పారు.

ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే బంకిమ్ దా.. అని కాదంటూ తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ఆపివేశారు. ‘బంకిమ్ దా కాదు.. బంకిమ్ బాబు అనాలి,” అన్నారు. బెంగాళీలో ‘దా’ అనేది సాధారణంగా అన్న, స్నేహితుడు లేదా పరిచయస్తులకు వినియోగించే పదమని ఎంపీ సౌగత్ రాయ్ వివరించారు. వెంటనే సరిచేసుకున్న మోదీ ఇక నుంచి బంకిమ్ బాబు అని సంబోధిస్తానని అన్నారు.

‘సరే, బంకిమ్ బాబు అని చెబుతాను. మీ భావాలను గౌరవిస్తున్నాను..’ అని అన్నారు. ఆ క్రమంలోనే మిమ్మల్ని కూడా నేను దాదా అని పిలిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. మోదీ ప్రసంగం చేస్తుండగా జరిగిన ఈ ఘటన ఆసక్తిని రేకెత్తించింది. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వందే మాతరం కేవలం ఒక మంత్రం కాదు, నినాదం కాదన్నారు.

భారతమాతను వలస పాలన నుంచి విముక్తి చేయాలనే పవిత్ర యుద్ధ పిలుపు అని అన్నారు. వందే మాతరం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాదు. అది రాజకీయ స్వాతంత్ర్యాన్ని దాటి, దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేయాలనే మహోన్నత లక్ష్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ 150 ఏళ్ల సంబరాలను మనం సాక్ష్యులుగా చూడడం గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. కాగా ఈరోజు పార్లమెంటు సమావేశాలకు ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ హాజరు కాకపోవడం గమనార్హం.

Related Post

దేవి వచ్చాడు.. మరి కీర్తికి ఓకేనా?దేవి వచ్చాడు.. మరి కీర్తికి ఓకేనా?

టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉండి, ఎంతకూ సెట్స్ మీదకు వెళ్లని సినిమా.. యల్లమ్మ. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యల్దండి.. తన రెండో చిత్రంగా దీన్ని రూపొందించాలనకున్నాడు. నిర్మాత దిల్ రాజు మరోసారి వేణు

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాలని చూస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చే ఆదాయంలో కొంత