hyderabadupdates.com movies ప్రపంచంలోనే ఎత్తైన రాముడు… మోదీ గ్రాండ్ ఎంట్రీ!

ప్రపంచంలోనే ఎత్తైన రాముడు… మోదీ గ్రాండ్ ఎంట్రీ!

గోవా వేదికగా మరో ఆధ్యాత్మిక అద్భుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దక్షిణ గోవాలోని ప్రసిద్ధ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన ఈ 77 అడుగుల కాంస్య విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) చెక్కిన ప్రముఖ శిల్పి రామ్ సుతార్ చేతుల మీదుగానే ఈ రాముడి విగ్రహం కూడా రూపుదిద్దుకోవడం విశేషం.

ఈ మఠానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటైన ఈ సంస్థ, సారస్వత సమాజంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గోవాలోని పార్తగలి గ్రామంలో ఈ మఠం శాఖను ఏర్పాటు చేసి 370 ఏళ్లు అవుతోంది. ఈ వేడుకల్లో భాగంగానే ప్రధాని మోదీ అక్కడికి వెళ్లి, ఆలయాన్ని సందర్శించి, ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 7 వేల నుంచి 10 వేల మంది భక్తులు మఠానికి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక సేవలకు పెట్టింది పేరైన ఈ మఠం వేడుకల్లో పాల్గొనడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. రాముడి విగ్రహం ఆవిష్కరణతో గోవా పర్యాటకానికి ఆధ్యాత్మిక శోభ కూడా తోడైందని స్థానికులు సంబరపడుతున్నారు.

గోవా వెళ్లడానికి ముందు ప్రధాని కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించారు. అక్కడ శ్రీకృష్ణ మఠంలో జరిగిన ‘లక్ష కంఠ గీతా పారాయణం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, పండితులు, సాధారణ ప్రజలు కలిపి దాదాపు లక్ష మందితో కలిసి మోదీ భగవద్గీత శ్లోకాలను పఠించడం ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. ప్రపంచం మొత్తం భారత్ లోని దైవత్వాన్ని చూసిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Related Post

దురంధర్ కొట్టిన దెబ్బ చిన్నది కాదుదురంధర్ కొట్టిన దెబ్బ చిన్నది కాదు

గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు కొనసాగిస్తున్నారంటే ఎంత పాజిటివ్ గా జనంలోకి దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వందల

మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే సినిమామైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే సినిమా

ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది పాప్ సింగర్స్ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. కానీ ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ప్రపంచమంతా ఒక సింగర్ పేరెత్తితే చాలు వెర్రెత్తిపోయేది. టీనేజీలోనే ప్రపంచ సంగీత ప్రియులందరినీ

5 Telugu and Tamil Films to Watch on OTT This Week: Vemal’s Mahasenha to social satire drama Dhandoraa5 Telugu and Tamil Films to Watch on OTT This Week: Vemal’s Mahasenha to social satire drama Dhandoraa

Cast: Sivaji, Manika Chikkala, Mounika Reddy, Navdeep, Bindu Madhavi, Ravi Krishna Thota Director: Muralikanth Devasoth Genre: Social Satire Drama  Language: Telugu Runtime: 2 hours and 16 minutes Where to watch: