hyderabadupdates.com movies ప్రభాస్ పంచ్.. మారుతి ఛాలెంజ్.. హైప్ పెంచుతాయా?

ప్రభాస్ పంచ్.. మారుతి ఛాలెంజ్.. హైప్ పెంచుతాయా?

ప్రభాస్ కొత్త సినిమా ‘రాజాసాబ్’ మొదలైనపుడు.. అభిమానుల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసిందే. మారుతి ఈ సినిమాకు ముందు మిడ్ రేంజ్ సినిమాలే తీశాడు. పైగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. చివరి చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులొచ్చాయి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అభిమానులు ఈ సినిమా వద్దే వద్దూ అంటూ ప్రభాస్‌కు విన్నపాలు చేశారు.

వారిలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే.. సినిమా గురించి అధికారిక ప్రకటన చేయడానికి కూడా మేకర్స్ భయపడ్డారు. కానీ ఈ సినిమా ప్రోమోలు చూశాక వారి అభిప్రాయం మారుతూ వచ్చింది. ఫస్ట్ టీజర్ లాంచ్ అయినపుడు మంచి బజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత చిత్రంగా మళ్లీ మైప్ తగ్గడం మొదలైంది. చాలా ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదు. పాటలు కూడా బానే ఉన్నాయి కానీ అనుకున్న స్థాయిలో లేవు. ప్రమోషన్లు కూడా సరిగా చేయలేదు. సంక్రాంతికి గట్టి పోటీ మధ్య వస్తున్న ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోగలదా అన్న సందేహాలు కలిగాయి.

ఐతే నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి, ఇతర టీం సభ్యుల మాటలు చూస్తే సినిమా ఆషామాషీగా ఉండదు అనే అభిప్రాయం అభిమానుల్లో కలుగుతోంది. ముఖ్యంగా మారుతి చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. ఒక్క శాతం కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గదని.. సినిమాలో అసలు డిజప్పాయింట్ చేసే సన్నివేశమే ఉండదని.. అలా ఉంటే తన ఇంటికి వచ్చి నిలదీయొచ్చని ఇంటి అడ్రస్ డీటైల్స్ కూడా స్టేజ్ మీద చెప్పేశాడు మారుతి.

సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి స్టేట్మెంట్ ఒక దర్శకుడి నుంచి రాదు. పైగా ఇదేమీ చిన్న సినిమా కాదు.. ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ ఇవ్వడానికి. అయినా మారుతి ఇలా మాట్లాడాడంటే తనకు సినిమా మీద అంత నమ్మకం ఉన్నట్లే. మరోవైపు తన సినిమాల గురించి గొప్పలు పోని ప్రభాస్ సైతం మారుతికి మంచి ఎలివేషన్ ఇచ్చాడు.

ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తావిస్తూ.. అది పెన్నుతో రాశావా, గన్నుతో రాశావా అని మారుతిని అడిగాడు. దీంతో పతాక సన్నివేశాలు ఒక రేంజిలో ఉంటాయని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. మిగతా టీం సభ్యులు కూడా సినిమా వేరే లెవెల్లో ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కాన్ఫిడెన్స్ చూశాక ప్రభాస్ అభిమానుల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి వాటిని అందుకునేలా సినిమా ఉంటుందా అన్నది ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది.

Related Post

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బుక్ మై షో క్రాష్ అయ్యింది. కల్కి పబ్లిసిటీ మీద నాగ అశ్విన్ దృష్టి పెట్టకపోయినా ఓపెనింగ్ రికార్డులు

జూబ్లీహిల్స్ లో మాటల యుద్ధం – కాంగ్రెస్ vs బీఆర్ఎస్జూబ్లీహిల్స్ లో మాటల యుద్ధం – కాంగ్రెస్ vs బీఆర్ఎస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ప్రచారంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకుంటున్నారు. మాటకు మాట అన్న‌ట్టుగా.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలు బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు.. విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ప్ర‌చారంలో ఆయా పార్టీల కీలక నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, ఇస్తున్న హామీల‌పై ఇరు ప‌క్షాలు..

‘బీజేపీ లేక‌పోతే.. కూట‌మి లేదు’‘బీజేపీ లేక‌పోతే.. కూట‌మి లేదు’

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న చ‌డిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. బీజేపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా ఆయన తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి నుంచి ప్రారంభించి..