hyderabadupdates.com movies ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో హడావిడి చేసిన చిన్న చిత్రాలు సోమవారానికి చేతులు ఎత్తేయడంతో షోల క్యాన్సిల్ ప్రహసనం చాలా చోట్ల కనిపిస్తోంది. డెకాయిట్ కనక రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కానీ అడివి శేష్ టైమింగ్ ని మెచ్చుకోవాలి. మంచి రిలీజ్ డేట్ తో పాటు పబ్లిసిటీ విషయంలో తీసుకున్న శ్రద్ధ  బ్రేక్ ఈవెన్ దాటేలా చేసింది.

ఇదిలా ఉంచితే డెకాయిట్ స్లో అయిపోయాక సిచువేషన్ మళ్ళీ మొదటికే వస్తుందనుకుంటున్న టైంలో డార్లింగ్ రూపంలో మరో ఆక్సీజెన్ దొరికింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మూడు కోట్ల దాకా వసూలు చేయడం ఇలాంటి టైంలో చిన్న రికార్డు కాదు. అందులోనూ అభిమానులే కాక రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా డార్లింగ్ ని మరోసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేసేందుకు వెళ్తున్నారు. మెయిన్ సెంటర్స్ చాలా చోట్ల ఇవాళ హౌస్ ఫుల్స్ ఎక్కువగా ఉన్నాయి.

వీకెండ్ వరకు డార్లింగ్ ప్రభావం ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మలయాళం డబ్బింగ్ వాలా 2 కేరళలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా తెలుగులో బజ్ లేదు. ట్రైలర్ కట్ బాగానే ఉన్నప్పటికి ఇలాంటివి బోలెడు చూసేసిన టాలీవుడ్ జనాలకు అంత కొత్తగా ఇందులో ఏముందో తెలియాలంటే రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే. అలాని ఇదేదో సెన్సేషన్ అవుతుందని కాదు కానీ ఉన్నంతలో యూత్ ని ఆకట్టుకున్నా వారం రోజులు ఫీడింగ్ చేసుకోవచ్చు.

రాజా సాబ్ గాయాన్ని ఇప్పుడు డార్లింగ్ సెలబ్రేషన్స్ ద్వారా ప్రభాస్ అభిమానులు పోగొట్టుకుంటున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ లో వింటేజ్ ప్రభాస్ ని మరోసారి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ సినిమా కాకపోయినా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఆరెంజ్ తర్వాత డార్లింగ్ కేనని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరమైన మోతాదులో పెట్టడంతో మాస్ వర్గాలు కూడా బాగానే వెళ్తున్నారు. చూడాలి మరి ప్రభాస్ ఫైనల్ నెంబర్ ఎంత నమోదు చేస్తాడో.

Related Post

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు. 5 సంవ‌త్స‌రాల కింద‌ట ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. ఆయ‌న ఏకంగా నిలువెత్తు గ‌డ్డం పెంచుకున్నారు. బెంగాల్ వాసుల‌కు-విశ్వ‌క‌వి