hyderabadupdates.com movies ప్రభాస్ హీరోయిన్లకు ఇది మామూలే

ప్రభాస్ హీరోయిన్లకు ఇది మామూలే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో పని చేసిన వాళ్లందరూ అతడి గురించి సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూల్లో కచ్చితంగా చెప్పే విషయం ఒకటుంటుంది. అదే.. తమ ఇంటి వంటలతో అతను అందించే విందు. తాను పని చేసే యూనిట్లో దాదాపుగా ముఖ్యులందరికీ తమ ఇంటి వంటలు రుచి చూపించకుండా ఉండడు ప్రభాస్. ప్రభాస్ వల్ల తమ డైట్ ప్లాన్లు దెబ్బ తిన్నాయని.. కడుపు ఉబ్బిపోయేలా తిండి పెట్టి చంపేస్తాడని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు కోస్టార్లు. 

ఈ జాబితాలోకి కొత్తగా ఇంకో పేరు చేరింది. ‘ఫౌజీ’ సినిమా కోసం ప్రభాస్‌తో జట్టు కట్టిన కొత్త కథానాయిక ఇమాన్వి కూడా ప్రభాస్ ఫుడ్ లవ్‌ను రుచి చూసింది. దీని మీద మాండేటరీ పోస్టు పెట్టేసింది. ‘ఫౌజీ’ షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి నుంచి తెప్పించి వడ్డించిన నాన్ వెజ్, వెజ్ వంటకాలను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసిన ఇమాన్వి.. కడుపు పేలిపోయేలా ఈ వంటకాలను తిన్నట్లు కామెంట్ చేసింది. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రభాస్ ఇంటి వంటకాలు తిని బాబోయ్ అన్న వాళ్లే.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఇమాన్వి తన వీడియోలతోనే ‘ఫౌజీ’ దర్శకుడు హను రాఘవపూడి కళ్లలో పడింది. ఇలాంటి నేపథ్యం ఉన్న కొత్త అమ్మాయిని ప్రభాస్ లాంటి టాప్ స్టార్‌కు జోడీగా తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఇమాన్వి టాలెంట్ తెలిసిన వాళ్లు.. తనేంటో ‘ఫౌజీ’ సినిమా రిలీజైనపుడు తెలుస్తుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 1930-40 మధ్య నేపథ్యంతో తెరకెక్కుతోంది.

Related Post

సుదీప్ అభిమానులు చాలా ఫీలయ్యారుసుదీప్ అభిమానులు చాలా ఫీలయ్యారు

నిన్న సాయంత్రం ప్రీమియర్లతో విడుదలైన బాహుబలి ది ఎపిక్ అనుకున్నట్టే భారీ వసూళ్లతో రికార్డులను దులిపేస్తోంది. కొత్త రిలీజ్ మాస్ జాతర కన్నా దీనికే బుకింగ్స్ ఎక్కువగా ఉండటం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభావం ఉంటుందని అనుకున్నారు కానీ

Nara Brahmani’s Heartfelt Message for Tejaswini’s Screen Debut Wins Hearts!Nara Brahmani’s Heartfelt Message for Tejaswini’s Screen Debut Wins Hearts!

Nara Brahmani expressed her immense pride and happiness as Tejaswini made her first on-screen appearance. Sharing her excitement on social media, Brahmani penned a loving message that instantly captured the