hyderabadupdates.com movies ప్రముఖ దేవాలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం?

ప్రముఖ దేవాలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం?

ఉత్తరాఖండ్‌లోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. చార్‌ధామ్ పరిధిలోని ఈ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలనే అంశాన్ని బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) బోర్డు సమావేశంలో ఆమోదించనున్నట్లు సమాచారం.

ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. ఆలయాల సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ దృష్ట్యా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే గంగోత్రి ధామ్‌లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించగా, దీనిపై గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకూ ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం.

ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్‌ 23న తిరిగి తెరుచుకోనుంది. కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకునే తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించనున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్‌ 19న అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకోనున్నాయి. అయితే, ఈ కొత్త ప్రవేశ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Related Post

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలుజగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం ఏదైనా కావచ్చు.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న యాత్రల తీరు ఇదే. గంటలోపు పూర్తయ్యే ప్రయాణం 6 గంటల

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ గురించి కూడా మొదలైనపుడు చాలా ధీమాగా స్టేట్మెంట్ ఇచ్చారు జక్కన్న. 2020 పక్కాగా సినిమా రిలీజవుతుందని ధీమాగా చెప్పారు.