hyderabadupdates.com movies ప్రియుడికి సర్ప్రైజ్ ఇస్తానని కట్టేసి…

ప్రియుడికి సర్ప్రైజ్ ఇస్తానని కట్టేసి…

‘బీడీఎస్ఎం రోల్‌ప్లే ‘ పేరుతో ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. వాయవ్య బెంగళూరులో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ప్రేమ పేరుతో ప్రియుడిని నమ్మబలికి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితురాలు ప్రేమ, మృతుడు కిరణ్ ఇద్దరూ రాజాజీనగర్‌లోని మొబైల్ సర్వీస్ సంస్థలో కలిసి పనిచేస్తూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వివాహానికి కిరణ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అంజననగర్‌లోని తన ఇంటికి కిరణ్‌ను పిలిపించిన ప్రేమ, ‘సర్ప్రైజ్ ప్రపోజల్’ పేరుతో కుర్చీకి కట్టేసి, కళ్లకు గంత కట్టింది. అనంతరం ముందుగానే సిద్ధం చేసిన ఇంధనాన్ని పోసి నిప్పంటించి, ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రియుడి నిర్లక్ష్యం, పెళ్లికి అంగీకరించకపోవడంపై కలిగిన ఆవేదనతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, సంబంధాల పేరుతో జరుగుతున్న వికృత చర్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Related Post

హ‌సీనాకు మ‌ర‌ణ శిక్ష‌… మోడీకి ఇబ్బందేనా?హ‌సీనాకు మ‌ర‌ణ శిక్ష‌… మోడీకి ఇబ్బందేనా?

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనాకు ఢాకాలో ఉన్న అంత‌ర్జాతీయ నేర వివాదాల ప‌రిష్కార కోర్టు (ఐసీటీ) తాజాగా మ‌ర‌ణ శిక్ష విధించింది. 2023-24 మ‌ధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం.. తీవ్ర రూపం దాల్చిన‌ప్పుడు ..