hyderabadupdates.com movies ప్రీమియర్ల కోసం సాబ్ ఫ్యాన్స్ వెయిటింగ్

ప్రీమియర్ల కోసం సాబ్ ఫ్యాన్స్ వెయిటింగ్

రాజా సాబ్ విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంది. జనవరి 8 రాత్రి వేసే ప్రీమియర్ల అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి అనుమతులు చివరి నిమిషం దాకా ఎక్కడ ఒత్తిడి పెడతాయోననే టెన్షన్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది.

సినిమాటోగ్రఫీ మంత్రికి లేఖ రాసి అందులో ప్రీమియర్లకు గాను మల్టీప్లెక్సు వెయ్యి రూపాయలు, సింగల్ స్క్రీన్ ఎనిమిది వందలు ఫ్లాట్ రేట్ పెట్టమని కోరినట్టుగా ఉన్న లెటర్ బయటికి వచ్చింది. ఇక రెగ్యులర్ షోలకు సైతం పెంపును అభ్యర్థిస్తూ దానికి గల కారణాలు సవివరంగా అందులో పొందుపరిచి ఉన్నాయి.

ఏపీలో సమస్య లేదు. ఓజి, అఖండ 2కే కాదు కూలి, కాంతార చాప్టర్ 1 లాంటి డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు కాబట్టి రాజా సాబ్ కి లేట్ చేయడం ఉండదు. కాకపోతే నైజాంలో బెనిఫిట్ షోలు పడతాయా లేదా అనేది కీలకం. ఎవరో ఒకరు కోర్టు కేసులు వేయడం, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి రావడం ఇదంతా ప్రతిసారి ఒక తతంగంలా అయిపోయింది.

ఈసారి సాంకేతికంగా అలాంటి ఇబ్బందులు రాకుండా ఏం చేయొచ్చనే దాని గురించి మంత్రి బృందంలోని అధికారులు కసరత్తు చేస్తున్నారట. ఒకవేళ అడిగినంత హైక్ ఇవ్వకపోతే ఏం చేస్తారనే సస్పెన్స్ మూవీ లవర్స్ ని విపరీతంగా నలిపేస్తోంది.

ఇప్పటికైతే రాజా సాబ్ నుంచి అన్ని ప్రమోషన్లు పూర్తయిపోయాయి. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఆడిపాడిన సాంగ్ ఏకంగా వీడియో రూపంలో వచ్చేసింది. కోరుకున్న దానికన్నా చాలా ఎక్కువ కంటెంట్ ఇచ్చేశారు కాబట్టి ఇక బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ చేయబోయే రాంపేజ్ చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవ్వాలి.

సంక్రాంతికి అందరికంటే ముందు వస్తున్న నేపథ్యంలో టాక్ చాలా కీలకం కానుంది. ఓపెనింగ్స్ అదిరిపోతాయి కానీ టాక్ నిలవడం చాలా ముఖ్యం. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఆందోళన ఉండదు. అదే జరగాలని అభిమానులు దేవుళ్ళకు దండాలు పెట్టేసుకుంటున్నారు.

Related Post

బాబు మ‌న‌సు మెచ్చిన సాయి ప్ర‌సాద్‌.. ఎవ‌రీయ‌న‌!బాబు మ‌న‌సు మెచ్చిన సాయి ప్ర‌సాద్‌.. ఎవ‌రీయ‌న‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబ మ‌న‌సు చూర‌గొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కుల నుంచి అధికారుల వ‌ర‌కు అంద‌రూ చెప్పేమాట‌. ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఆయ‌న అంచ‌నాల‌ను అందుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మెద‌డుకు ప‌దును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయ‌న

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలానెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా తీశారేమో అనిపిస్తుంది. మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నిడివి అంటే యానిమల్ రేంజ్ లో ఉంటాయేమోననే అంచనాలు

వైఎస్ జగన్ తో దళపతి విజయ్.. ఇంకేముంది..!?వైఎస్ జగన్ తో దళపతి విజయ్.. ఇంకేముంది..!?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే