hyderabadupdates.com movies ప్రీమియర్ల ప్లానింగులో ఉస్తాద్ సతమతం

ప్రీమియర్ల ప్లానింగులో ఉస్తాద్ సతమతం

మార్చి 18 రాత్రి ప్రీమియర్ షోల అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ తదితర పనుల్లో బిజీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ బృందం టైం చాలా తక్కువగా ఉండటంతో ప్రమోషన్లపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతోంది. సరే కంటెంట్ బాగుంటే పవన్ మూవీకి ఇవన్నీ అక్కర్లేదు కానీ ఇప్పుడు అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే.

ప్రీమియర్లను ఎలా ప్లాన్ చేస్తారనేది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల హైక్ సులభంగా వచ్చేస్తుంది. అదేమీ సమస్య కాదు. కాకపోతే ధర ఎంత పెడతారనేది అసలు చిక్కు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 600 రూపాయలు పెట్టినా ఇబ్బందయ్యేలా ఉంది. అఖండ తాండవం 2కి కొన్ని ఏరియాల్లో ఇదే సమస్యగా మారింది. ఓజి హైప్, బడ్జెట్ వేరు కాబట్టి దానికి వెయ్యి రూపాయలు పెట్టినా అభిమానులు లెక్క చేయలేదు.

కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అంత భీభత్సమైన బజ్ లేదు. మెల్లగా బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే సమయం ఎక్కువగా లేదు. అసలే దురంధర్ ది రివెంజ్ షోలను సాయంత్రం అయిదు గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఆ ప్రభావం రాత్రి నుంచే మొదలవుతుంది. దానికి ధీటుగా ఉస్తాద్ టాక్ రావాలి. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఎలా చూపించాడనేది చాలా కీలకం కానుంది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే తొంభై రోజుల ముందు అనుమతి తీసుకుంటే బెనిఫిట్ షోలు, హైక్స్ కి పర్మిషన్ ఇవ్వమని కోర్టు ఇంతకు ముందే చెప్పింది. టెక్నికల్ గా ఇది పాటించడం ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల కాదు. దాని బదులు అనుమతి అవసరం లేని గరిష్ట ధర 295 రూపాయలు (మల్టీప్లెక్సులు) పెట్టేస్తే మంచి ఫలితం ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది. ఒకవేళ ఏపీలో జిఓ తీసుకున్నా ఒక వీకెండ్ కే పరిమితం చేయాలని, పదేసి రోజులు పెట్టడం వల్ల వసూళ్లు రావడం లేదని బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

వీలైనంత త్వరగా మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తే బెటర్. ఉగాది, రంజాన్ పండక్కు వస్తున్న స్టార్ హీరో స్ట్రెయిట్ మూవీ ఇదొక్కటే కావడంతో మరీ ఎక్కువ ఆశించకుండా డీసెంట్ ప్రైజింగ్ తో వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో అనాలసిస్ చేసుకోవాలి. ఒకపక్క దురంధర్ రివెంజ్ ప్రీమియర్ షోలు అంతకంత పెరుగుతూ పోతున్నాయి. ఉస్తాద్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తే అభిమానులు రిలాక్స్ అవుతారు. అప్పటిదాకా టెన్షనే.

Related Post

ఆదర్శ కుటుంబం… ఎందుకీ సీక్రెట్?ఆదర్శ కుటుంబం… ఎందుకీ సీక్రెట్?

విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం (AK47)’ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఇటీవల ఒక ఇంట్రెస్టింగ్ లీక్ వచ్చిన విషయం తెలిసిందే. అదే

చిరు-వెంకీ పాట‌లో లిరిక్ మార్పు నిజ‌మేచిరు-వెంకీ పాట‌లో లిరిక్ మార్పు నిజ‌మే

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతున్న‌ మెగాస్టార్ చిరంజీవి సినిమా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు నుంచి ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఒక పాట‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. అందులో చిరు, వెంకీల మీద తీసిన మెగా విక్ట‌రీ పాట‌లో ఒక