hyderabadupdates.com Gallery ఫిబ్ర‌వ‌రి 14న ల‌వ్ స్టోరీ మూవీ రీ రిలీజ్

ఫిబ్ర‌వ‌రి 14న ల‌వ్ స్టోరీ మూవీ రీ రిలీజ్

ఫిబ్ర‌వ‌రి 14న ల‌వ్ స్టోరీ మూవీ రీ రిలీజ్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొద‌లైంది. గ‌తంలో టాప్ లో ఉన్న మూవీస్ తో పాటు బ్లాక్ బస్ట‌ర్ గా నిలిచిన చిత్రాల‌ను ఒక్క‌టొక్క‌టిగా తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఆ మేర‌కు అందినంత మేర దండుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే గ‌తంలో ఫెయిల్ అయిన మూవీస్ కూడా రిలీజ్ కాగా అవి కూడా ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యాయి. మూవీ మేక‌ర్స్, నిర్మాత‌ల‌కు భారీ ఆదాయం స‌మ‌కూర్చి పెట్టాయి. దీంతో కొత్త‌గా సినిమాల‌ను తీయ‌డం , ఇబ్బందులు ప‌డేకంటే గ‌తంలో తాము తీసిన వాటినే తిరిగి కొన్ని రంగులు అద్ది రిలీజ్ చేస్తే కాసులు అందుకోవ‌చ్చ‌ని ఆశిస్తున్నారు. ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ త‌రుణంలో తాజాగా మ‌రో స‌క్సెస్ టాక్ తెచ్చుకున్న ల‌వ్ స్టోరీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ శ‌నివారం ప్ర‌క‌టించారు.
ఇందులో అక్కినేనా నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి న‌టించారు. ల‌వ్ స్టోరీని వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రం పునఃవిడుదల అవుతుండటంతో నాగ్, ప‌ల్ల‌వి ఫ్యాన్స్ తెగ సంబ‌ర ప‌డుతున్నారు. ఈ ప్రేమకథను వెండితెరపై మరోసారి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంది విడుద‌ల కానుంది. శేఖ‌ర్ క‌మ్ముల దీనిని తెర‌కెక్కించాడు. ఇది పూర్తిగా రొమాంటిక్ డ్రామా. నాగ చైత‌న్య సినీ కెరీర్ లో మ‌రిచి పోలేని మూవీగా నిలిచింది ల‌వ్ స్టోరీ. త‌న‌ను కొత్త కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌డు ప్ర‌ద‌ర్శించిన భావోద్వేగ న‌ట‌న ప‌లువురిని ఆక‌ట్టుకుంది. త‌న‌తో పాటు పోటీగా న‌టించి మెప్పించింది సాయి ప‌ల్ల‌వి.
The post ఫిబ్ర‌వ‌రి 14న ల‌వ్ స్టోరీ మూవీ రీ రిలీజ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణంస్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం

అమ‌రావ‌తి : ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ ప్రసాద్, తిరుమల నాయుడు, భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి స్త్రీ శక్తి పథకం పై అడిగిన ప్రశ్నల‌కు

CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత – సీఎం రేవంత్‌CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత – సీఎం రేవంత్‌

      నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని అని గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత… మీరందరూ అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉంది.

బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలిబీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలి

హైద‌రాబాద్ : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్