hyderabadupdates.com Gallery ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌త్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది. ఇందులో భాగంగా గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలో కీల‌క ప‌ద‌వుల‌లో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు, రాధా కిష‌న్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, కేసీఆర్ మేన‌ల్లుడు, మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ రావుల‌ను విచారించింది. ప్ర‌భాక‌ర్ రావు, రాధాకిష‌న్ రావుల‌ను ప‌దేప‌దే విచారించ‌గా కేటీఆర్, హ‌రీష్ ల‌ను ఒక్కొక్క‌రిని ఏడు గంట‌ల‌కు పైగా విచారించారు. ఇదే క్ర‌మంలో బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. వ‌య‌సు మీద ప‌డ‌డంతో త‌న‌కు వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు నోటీసులో పేర్కొంది.
త‌ను నేరుగా సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొంది. ఇదే స‌య‌మంలో వ‌య‌సు రీత్యా త‌ను కోరుకున్న చోటులో విచార‌ణ చేప‌డ‌తామ‌ని కూడా స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి కేసీఆర్ కు నోటీసు ఇవ్వ‌డంపై. మ‌రో వైపు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఒక‌వేళ కేసీఆర్ గ‌నుక స్వంతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు గ‌నుక హాజ‌రు అయిన‌ట్ల‌యితే త‌న క్యాడ‌ర్ ను , అభిమానుల‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్టం. లా అండ్ ఆర్డ‌ర్ ను కంట్రోల్ చేయ‌డం త‌ల‌కు మించిన భారం అవుతుంది. అందుకేనేమో కేసీఆర్ కూడా తాను స్వ‌యంగా విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని, త‌న ఫామ్ హౌజ్ కు వ‌చ్చి విచారించాల‌ని కోరారు.
The post ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలుAadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు

    ఆధార్‌ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్ల వివరాలు ఈ

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్