hyderabadupdates.com movies ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?

ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే పునరుద్ధరించటం జరిగిపోయాయి.

దీనికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద గల తమ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 24 మెగావాట్ విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ వారు దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరిగాయి. చర్చల అనంతరం విద్యుత్ ను పునరుద్ధరించారు. 

అంతకుముందు ఏం జరిగిందంటే గడువు ముగిసినా దుర్గగుడి అధికారులు దాదాపు 3.20 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

ఒకసారిగా విద్యుత్తు ఆగిపోవడంతో, అధికారులు వెంటనే జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. కొద్దిసేపు లిఫ్టులు, ఏసీలు పనిచేయకపోవడంతో భక్తులు కొంత అసౌకర్యానికి పోయారు. అధికారులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారితో చర్చలు జరిపి విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చేశారు. 

Related Post

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉందిఅవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా కనిపించారంటే అది ఈ ఒక్క సినిమాకే అన్నది నిజం. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కు రాజమౌళి,

Meesala Pilla promo from Megastar Chiranjeevi’s MSG is beautiful
Meesala Pilla promo from Megastar Chiranjeevi’s MSG is beautiful

Megastar Chiranjeevi will next be seen in the film Mana Shankara Varaprasad Garu (MSG). The family entertainer marks the first collaboration between Chiru and hit machine Anil Ravipudi. Star heroine

చిరు లేడు కానీ… చిరు వచ్చాడుచిరు లేడు కానీ… చిరు వచ్చాడు

గత మూడు దశాబ్దాల్లో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడ్డ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఎంతోమంది దర్శకులకు సినిమా పిచ్చి ఎక్కించడంలో చిరు ప్రధాన పాత్ర