hyderabadupdates.com movies ఫ్యాన్ వార్స్ లో డైరెక్టర్స్ ఎందుకయ్యా?

ఫ్యాన్ వార్స్ లో డైరెక్టర్స్ ఎందుకయ్యా?

కాదేదీ ఫ్యాన్ వార్స్‌కు అనర్హం అన్నట్లుగా.. సోషల్ మీడియాలో గొడవలు పడడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు సినీ అభిమానులు. ఈ ఫ్యాన్ వార్స్‌లో భాగంగా అసలు సంబంధం లేని వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేసి ట్రోల్ చేయడమూ జరుగుతుంటుంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ, అట్లీ.. ఇలాగే ట్రోల్ అవుతున్నారు.

టాలీవుడ్ అభిమాన గణాల్లో రకరకాల వర్గాలున్న సంగతి తెలిసిందే. ఆ వర్గాల్లో ఎవరు ఎప్పుడు ఎవరితో గొడవ పడతారో అంచనా వేయలేం. కొన్నిసార్లు రెండు వర్గాలు కలిసి ఇంకో వర్గం మీదికి వెళ్తుంటాయి. ఆ సందర్భంలో కలిసి ఉన్న వాళ్లు తర్వాత ఇంకో మూమెంట్లో విరోధులుగా మారి గొడవ పడుతుంటారు. ఇప్పుడు ఎవరిని ఎవరు ఎందుకు ట్రిగ్గర్ చేశారో కానీ.. ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎక్స్‌లో పెద్ద గొడవ నడుస్తోంది.

ఈ క్రమంలో ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి వంగను అల్లు అర్జున్ అభిమానులు టార్గెట్ చేస్తుంటే.. రెబల్ ఫ్యాన్సేమో బన్నీతో సినిమా తీస్తున్న అట్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దర్శకులు ఇద్దరి మీద అవతలి వాళ్లు కాపీ ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు.

అట్లీకి ముందు నుంచి ‘కాపీ డైరెక్టర్’ అనే ముద్ర ఉంది. పాత కథలనే అటు ఇటు తిప్పి సినిమాలు తీస్తాడని.. హాలీవుడ్ సినిమాల్లో సీన్లు లేపేస్తాడని విమర్శలున్నాయి. ఇదే పాయింట్ మీద తన పాత సినిమాల్లోని కాపీ సీన్లను పోస్ట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే.. బన్నీ అభిమానులు రంగంలోకి దిగారు.

యానిమల్, అర్జున్ రెడ్డి చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచిన హాలీవుడ్ చిత్రాల సీన్ల తాలూకు వీడియోలు తెచ్చి పోస్ట్ చేస్తూ సందీప్ కూడా కాపీ డైరెక్టరే అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అభిమానుల గొడవలేమో కానీ.. వారి దెబ్బకు దర్శకుల ఇమేజ్ దెబ్బ తింటోంది.

Related Post

ప్రసాదుగారు మళ్ళీ సిక్సు కొట్టేశారుప్రసాదుగారు మళ్ళీ సిక్సు కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చేశారు. దీనికి  రెండు కారణాలున్నాయి. రేఖా, ప్రసాదూ అంటూ చిరంజీవి, నయనతార ఇద్దరూ పలరించుకునే ప్రోమో మీద

Dhandoraa to Make Noise This Christmas with a Powerful Social DramaDhandoraa to Make Noise This Christmas with a Powerful Social Drama

After the success of Colour Photo and Bedurulanka 2012, producer Ravindra Benerjee Muppaneni of Loukya Entertainments is all set to deliver another striking film — Dhandoraa. Written and directed by