hyderabadupdates.com movies ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి లాంటి స్ట్రెయిట్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే విలక్షణతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం తన ప్రత్యేకత. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు అనిపించినా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా యమా బిజీ అయిపోయాడు.

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై లాంటి ఓటిటి మూవీస్ మరింత పేరు తీసుకొచ్చాయి. రెగ్యులర్ గా వెబ్ కంటెంట్ లో కనిపించే మనోజ్ బాజ్ పాయ్ చేసిన కొత్త ఓటిటి మూవీ ఘుస్కోర్ పండత్. అంటే అర్థం లంచగొండి పండితుడు అని.

ఇప్పుడీ టైటిల్ వివాదాలకు దారి తీస్తోంది. ఒక సామజిక వర్గాన్ని అవమానపరిచేలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పేరు పెట్టారని, అదే వేరే కులాలకు మతాలకు ఆపాదించి ఎందుకు చేయరని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు నిలదీస్తున్నారు. సినిమాల్లో పాత్రలు అవినీతి చేయడం సహజమని, దాన్ని చూపించడం తప్పేమి కాదని, కానీ ఇలా టైటిల్ లో ఒక వర్గాన్ని అవమానపరిచేలా చేయడం తగదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ నిన్న విడుదల చేసిన టీజర్ లో ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనే హింట్ ఇచ్చారు. లంచాలకు మరిగిన ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ లో అన్నమాట.

ప్రస్తుతం ఈ కాంట్రవర్సి గురించి నెట్ ఫ్లిక్స్ స్పందించలేదు. టైటిల్ మాత్రం పెద్ద రచ్చే చేసేలా ఉంది. అయినా హీరో పాత్రను అలా సంబోధించడంలో తప్పు లేదు కానీ ఒక సామజిక వర్గం పవిత్రంగా భావించే ఇంటి పేరుని ఇలా కించపరిచేలా చేయడం మాత్రం సమర్ధించే విషయం కాదు.

త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న ఘుస్కోర్ పండత్ కు ఈ నిరసన సెగలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఒకవేళ ఎవరైనా కేసు వేస్తే స్ట్రీమింగ్ వాయిదా పడొచ్చు. థియేటర్ల దగ్గర అడ్డుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది కేవలం డిజిటల్ రిలీజ్ కోసం తీసిన ఓటిటి మూవీ కాబట్టి చట్టపరంగా మాత్రమే బ్రేక్ వేసే అవకాశముంది.

Related Post

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో గంట గ్యాప్‌… చంద్ర‌బాబు ఏం చేశారంటే!ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో గంట గ్యాప్‌… చంద్ర‌బాబు ఏం చేశారంటే!

సీఎం చంద్ర‌బాబు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల‌తో మ‌రోసారి టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. ఈ ప‌ర్య‌ట‌న‌లో దొరికిన ఓ గంట గ్యాప్‌ను కూడా వ‌దులు కోకుండా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అభివృద్ధిపై స్పందించారు. స‌హ‌జంగా నిరంత‌రం

రూపాయి బిళ్ళతో మోదీ గడియారం.. దాని చరిత్ర తెలుసా?రూపాయి బిళ్ళతో మోదీ గడియారం.. దాని చరిత్ర తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ ధరించే జాకెట్లు, కుర్తాలు ఎప్పుడూ స్పెషలే. ఆయన స్టైల్ స్టేట్‌మెంట్‌ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మోదీ చేతికి ఉన్న వాచ్ ఒకటి గట్టిగానే వైరల్ అవుతోంది. ఎందుకంటే అది