hyderabadupdates.com movies ఫ్యూచర్ లేని నేత.. ఫ్యూచర్ సిటీ: కేటీఆర్

ఫ్యూచర్ లేని నేత.. ఫ్యూచర్ సిటీ: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు గుప్పించారు. రాష్ట్రంలో ఫ్యూచర్ లేని పార్టీకి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాంటి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడుతున్నారట అని ఎద్దేవా చేశారు. దీనికిగాను 16 వేల ఎకరాలను సేకరించి తన వారికి పంపిణీ చేయాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, తన అనుకూల పెట్టుబడిదారుల కోసం పేదల భూములను లాక్కుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.

అక్రమాలకు కేరాఫ్

రేవంత్ రెడ్డి పాలన అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖలు అవినీతిమయంగా మారాయని విమర్శించారు. గత నెల రోజుల్లోనే నలుగురు తహసీల్దార్లు అవినీతిలో చిక్కుకున్నారని, పోలీసులు కూడా ఇదే దారిలో ఉన్నారని అన్నారు. వీరంతా పైకి సంచులు మోసేందుకు బలి అవుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నెలకు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పిన కేటీఆర్, ఆయన అలా ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.

శాశ్వతం కాదు

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ గతంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించిన విషయం ఈ సందర్భంలో ప్రస్తావనార్హం. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిటీలో దోమల బెడద

హైదరాబాద్ నగరంలో సాయంత్రం 5 గంటలు అయితే దోమలు కుట్టికుట్టి ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. దోమలను కూడా నియంత్రించలేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానంటూ పేదల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ఆక్రమణలు, దందాలకు తెరతీశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పుడు అవే భూములను వాడుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేసిన వారు సీతక్క, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.

Related Post

హీరోని చూసి జాలిప‌డ్డ త‌ల్లిహీరోని చూసి జాలిప‌డ్డ త‌ల్లి

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి తెచ్చుకున్న న‌టుడు విశ్వ‌క్సేన్‌. తొలి సినిమా వెళ్ళిపోమాకేలో సాఫ్ట్ క్యారెక్ట‌ర్ చేసిన అత‌ను.. రెండో సినిమా ఫ‌ల‌క్‌నుమా దాస్‌కు ఎవ్వ‌రూ ఊహించ‌ని మేకోవ‌ర్ ఇచ్చాడు. అగ్రెసివ్ క్యారెక్ట‌ర్లో చెల‌రేగిపోయి

Paapi Paapi Song Sparks Buzz Ahead of Gurram Paapireddy ReleasePaapi Paapi Song Sparks Buzz Ahead of Gurram Paapireddy Release

The makers of Gurram Paapireddy have unveiled the film’s promotional song titled “Paapi Paapi”, giving audiences a lively glimpse into the movie’s quirky and darkly comic world. With its energetic