hyderabadupdates.com Gallery బ‌ద్నాం చేయాల‌ని చూస్తే జ‌నం న‌మ్మ‌రు

బ‌ద్నాం చేయాల‌ని చూస్తే జ‌నం న‌మ్మ‌రు

బ‌ద్నాం చేయాల‌ని చూస్తే జ‌నం న‌మ్మ‌రు post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం వేడందుకుంది. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తాము అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు గ‌ట్టెక్కిస్తాయ‌ని న‌మ్ముతోంది. ఆ మేర‌కు పార్టీ చీఫ్‌, సీఎం ఎంకే స్టాలిన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. త‌మ కుటుంబంపై క‌రప్ష‌న్ ఆరోప‌ణ‌లు వ‌చ్చినా అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు ఆ పార్టీకి ఢోకా లేకుండా చేశాయి.
ఇదే స‌మ‌యంలో పార్టీకి, ప్ర‌భుత్వానికి కంట్లో న‌లుసుగా మారాడు త‌మిళ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన హీరో, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని బెంబేలెత్తిస్తున్నాడు. స్టాలిన్ అంకుల్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్ర‌చారాన్ని ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా యూత్ ఎగ‌బ‌డుతున్నారు. త‌మ నాయ‌కుడు నువ్వేనంటూ పేర్కొంటున్నారు.
ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. ఈ సంద‌ర్బంగా త‌న కుటుంబం గురించి, వ్య‌క్తిగ‌త వివ‌రాల గురించి పెద్ద ఎత్తున దుష్ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపాడు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. కావాల‌ని కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని విడాకుల గురించి రూమ‌ర్స్ లేవ‌దీశారంటూ ఆరోపించారు. ఇందులో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నాడు. తాము లోప‌ల ప‌రిష్క‌రించుకుంటామ‌ని తెలిపాడు.
తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార పార్టీ ఆగ‌డాలు, పాల‌న‌పై నిప్పులు చెరిగాడు విజ‌య్. నా చుట్టూ ఉన్నవారు ఎన్నో ఏళ్లుగా కాచుకుని ఉండి, ఎన్నికలకు సరిగ్గా 30 రోజుల ముందు నన్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించారని మండిప‌డ్డారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేద‌ని అన్నారు. మీరు నన్ను ఎన్ని కష్టాలకు, బాధలకు గురిచేసినా సరే… నన్ను ప్రజల నుండి వేరు చేయడం మాత్రం మీ వల్ల కాదని స్ప‌ష్టం చేశాడు విజ‌య్.
The post బ‌ద్నాం చేయాల‌ని చూస్తే జ‌నం న‌మ్మ‌రు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌గ‌న్ రెడ్డికి అభివృద్ది అంటే ప‌డ‌దు : ఎస్. స‌వితజ‌గ‌న్ రెడ్డికి అభివృద్ది అంటే ప‌డ‌దు : ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న‌కు నిలువెల్లా విషం త‌ప్ప ఏమీ లేద‌న్నారు. అభివృద్ది అంటే ప‌డ‌ద‌న్నారు. ఎంత సేపు చిల్ల‌ర రాజ‌కీయాలు

జగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయంజగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

అమ‌రావ‌తి : దివంగ‌త‌, మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ దేశానికి అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు

Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌

Russia : భారత్‌కు రష్యా బంపరాఫర్‌ ప్రకటించింది. రోస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది.