hyderabadupdates.com movies బ‌న్నీ-అట్లీ.. హాలీవుడ్డోళ్ల‌కే ఛాలెంజట‌

బ‌న్నీ-అట్లీ.. హాలీవుడ్డోళ్ల‌కే ఛాలెంజట‌

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రి విజువలైజేషన్ వీడియో చూసే అందరూ షాకైపోయారు. ఈ సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమైంది. దీని గురించి ఎవ్వరు మాట్లాడినా ఆహా ఓహో అనే అంటున్నారు. 

ఏకంగా 700-800 కోట్ల బడ్జెట్లో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీఎఫెక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ సహా పలు విభాగాల్లో పదుల సంఖ్యలో ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమా గురించి బయటి వాళ్లు మాట్లాడ్డమే తప్ప.. మెయిన్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు స్వయంగా దర్శకుడు అట్లీ ఒక ఇంటర్వ్యూలో బన్నీతో తాను చేస్తున్న సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడనిది ఈ చిత్రంలో చూపించబోతున్నామని అతను ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. హాలీవుడ్లో కూడా రెఫరెన్సులు లేని స్థాయిలో ఈ సినిమా కొత్తగా ఉంటుందని అతను చెప్పాడు. ఈ సినిమా తీస్తూ రెఫర్ చేసుకోవడానికి తమ దగ్గర ఏ బైబిల్ లేదని.. అంతా కొత్తగా అనిపించిందని.. తాము నేర్చుకుంటూ సినిమా తీస్తున్నామని అతనన్నాడు.

ఈ చిత్రం అచ్చంగా హాలీవుడ్ సినిమాలాగే ఉంటుందని.. అక్కడి నిపుణులే బోలెడంతమంది ఈ సినిమాకు పని చేస్తున్నారని అట్లీ చెప్పాడు. ఆ టెక్నీషియన్లు సైతం తమకు ఈ సినిమా పెద్ద ఛాలెంజ్ అని చెప్పారని అట్లీ వెల్లడించాడు. ఈ సినిమా నుంచి ఏదైనా విశేషాన్ని ప్రేక్షకులకు చూపిద్దామా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని.. అందుకు ఇంకొన్ని నెలలు పడుతుందని అట్లీ చెప్పాడు. బన్నీ లుక్ కొత్తగా ఉంటుందట కదా, ట్రాన్స్‌ఫర్మేషన్ వేరే లెవల్ అట కదా అని అంటే.. కొన్ని నెలలు ఎదురు చూడండి, అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతారు అంటూ ఊరించాడు అట్లీ.

Related Post

‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా అనిల్ కుమార్ యాదవ్ పాల్గొనలేదు.

లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!

ప్రజా ప్రతినిధి…అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు ఎన్నుకున్న నేత. తమ నియోజకవర్గం నుంచి గెలిపించి శాసన సభకు పంపితే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి ఆ నేతకు ఓటేస్తారు. అసెంబ్లీలో కావచ్చు…బయట కావచ్చు…తమ ప్రాంత సమస్యలు తీరుస్తారని ప్రజలు