hyderabadupdates.com movies బన్నీ రికార్డు చిరు సొంతం

బన్నీ రికార్డు చిరు సొంతం

ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో. సినిమాల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు, పారితోషకాలు.. ఇలా ఏది చూసుకున్నా చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ చిత్రాల వసూళ్లు ఉండేవి. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే అన్నట్లుండేది.

కానీ చిరు మధ్యలో పదేళ్ల బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేసరికి వేరే స్టార్లు చాలామంది ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల మార్కెట్ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. అయినా సరే రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు మెగాస్టార్.

కానీ ఆ తర్వాత మాత్రం చిరు కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో ఈ తరం ప్రేక్షకుల్లో చాలామంది చిరు గురించి తేలిగ్గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆచార్య, భోళా శంకర్ లాంటి సినిమాల ఫలితాలు యాంటీ ఫ్యాన్స్‌కు పెద్ద ఆయుధాలను ఇచ్చాయి.

కానీ చిరు అసలు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రుజువు చేస్తోంది. అనిల్ రావిపూడి లాంటి ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తోడవడంతో చిరు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నారు. ఆరంభం నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.

రిలీజైన నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ నెలకొల్పిన రికార్డును చిరు చిత్రం బద్దలు కొట్టడం విశేషం. తాజాగా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏడో రోజు ఏపీ, తెలంగాణల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నెలకొల్పిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ అధిగమించింది.

బన్నీ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.6 కోట్లు కొల్లగొడితే.. చిరు చిత్రం రూ.9.5 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవరాల్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి.

Related Post

టాలీవుడ్‌కు ఇంకో రీ‘మేకు’టాలీవుడ్‌కు ఇంకో రీ‘మేకు’

గతంలో రీమేక్ అంటే మినిమం గ్యారెంటీ అనే భరోసా ఉండేది. వేరే భాషలో పెద్ద హిట్టయిన సినిమాను తీసుకుని రీమేక్ చేస్తే.. చాలా వరకు సినిమాలు ఆడేసేవి. ఠాగూర్, నువ్వు వస్తావని లాంగటి రీమేక్‌ సినిమాలు రికార్డ్ బ్రేకింగ్ హిట్లు అయ్యాయి.

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలిహీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా ఇలాంటి ఈవెంట్లు చేసే నిర్వాహకులు అప్రమత్తం కావడం లేదు. సినీ తారలు వస్తున్నారంటే అక్కడికి పెద్ద ఎత్తున జనం పోగవుతారన్నది

సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే..ఇంకా ఉన్నాయి: చంద్రబాబుసూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే..ఇంకా ఉన్నాయి: చంద్రబాబు

ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతమైన ప్రధానులల ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు…భారత దేశంలోని రాష్ట్రాలలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు…ఇటువంటి డెడ్లీ కాంబినేషన్ ఉంటే ఇటు రాష్ట్రం..అటు కేంద్రం అభివృద్ధి