డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం ఎప్పుడూ చూడని ఒక సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే 3డి వర్షన్. ఇప్పటిదాకా బాలకృష్ణ కెరీర్ లో ఏ సినిమా ఈ సాంకేతికత వాడలేదు. ఆ మాటకొస్తే సీనియర్ స్టార్లు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు కూడా ఈ టెక్నాలజీ అవసరం పడలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కి 3డి వాడారు కానీ ఆడియన్స్ కి పెద్దగా తేడా అనిపించలేదు. సబ్ టైటిల్స్ ముందుకు చొచ్చుకు రావడం తప్ప ఎలాంటి ఫీలింగ్ కలిగించలేదు. కాబట్టి దాన్ని ఒరిజినల్ కన్వర్షన్ గా పరిగణించలేం. కానీ అఖండ 2 అలా కాదు.
అత్యున్నత సాంకేతికత వాడి త్రీడిలోకి మారుస్తున్నారు. మీడియాకు ప్రదర్శించిన కొన్ని శాంపిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకవేళ ఫుల్ వెర్షన్ కూడా ఇదే స్థాయిలో ఉంటే మాత్రం జనం ఎగబడి చూడటం ఖాయం. అఖండ 2 ఈసారి ఉత్తరాది మార్కెట్ ని బలంగా టార్గెట్ చేసుకుంది. అందుకే ప్రమోషన్లు ముంబై నుంచి మొదలుపెట్టారు. అఖండ 1కి ఓటిటిలో నార్త్ సినీ ప్రియులు ఇచ్చిన స్పందన చూశాక సీక్వెల్ కోసం బలమైన థియేట్రికల్ ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్రీడి ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం మొదలయ్యింది. దీని కోసం అదనంగా బడ్జెట్ ఖర్చవుతున్నా నిర్మాతలు సిద్ధ పడ్డారు.
ఇంకో పంతొమ్మిది రోజులు మాత్రమే టైం ఉండటంతో టీమ్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టబోతోంది. డిసెంబర్ మొదటివారం యుఎస్ ట్రిప్ ఉంటుంది. దర్శకుడు బోయపాటి శీను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి డబుల్ మార్జిన్ తో బ్లాక్ బస్టర్ ఖాయమని చెబుతున్నారు. సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పే ఈ మూవీ 3డిలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. 21న కర్ణాటకలో ట్రైలర్ లాంచ్, అంతకన్నా ముందు వైజాగ్ లో సాంగ్ లాంచ్ ఉంటాయట. ముందు రోజు రాత్రే అభిమానుల కోసం స్పెషల్ ప్రీమియర్లు వేసే ఆలోచన బలంగా ఉంది.