ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలు చేసి రెండు సినిమాలు చేసే ట్రెండుకు శ్రీకారం చుట్టిన సినిమా.. బాహుబలి. ముందు ఒక సినిమాగానే మొదలైనప్పటికీ.. కథ పరిధి పెద్దది కావడం, బడ్జెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని రెండు భాగాలు చేశాడు రాజమౌళి. 2015లో తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ పేరుతో రిలీజై అద్భుత విజయం సాధిస్తే.. 2017లో రెండో భాగాన్ని ‘బాహుబలి: ది కంక్లూజన్’గా రిలీజ్ చేసి మరింత సెన్సేషన్ క్రియేట్ చేశాడు జక్కన్న. ఐతే ఇప్పుడు ఇండియన్ సినిమాలో తొలిసారిగా రెండు భాగాలుగా రిలీజైన సినిమాను ఒకటిగా చేసి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తోంది టీం.
ఐతే ఆ చిత్ర బృందంలో ఈ ఆలోచన ఎప్పుడు ఎవరికి వచ్చిందన్నది స్పష్టత లేదు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజైనపుడు ఒక వ్యాపారవేత్త సోషల్ మీడియా వేదికగా ఈ ఐడియా ఇవ్వడం విశేషం. బాహుబలి-2 విడుదలైన వారానికి పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ట్విట్టర్లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. 2017 మే 6న ఒక పోస్టు పెట్టారు. ‘‘రాజమౌళి గారు… బాహుబలి పార్ట్ 1, 2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం.
ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు’’ అని విక్రమ్ నారాయణ రావు ట్వీట్లో పేర్కొన్నారు. ఐతే ఆ ఐడియా బాహుబలి టీం వరకు చేరి, ఇప్పుడు ఇలా చేస్తున్నారేమో తెలియదు కాదు.. ఎనిమిదేళ్ల కిందటి ఆ ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ‘బాహుబలి: ది ఎపిక్’ రిలీజ్ కానుంది. విక్రమ్ అప్పుడన్నట్లు 500 కోట్ల వసూళ్లు కష్టం కానీ.. ఈ సినమా మినిమం వంద కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
@ssrajamouli pic.twitter.com/s9mglmK4pM— Vikram Narayanarao (@whoisvkram) May 6, 2017