hyderabadupdates.com movies బాహుబలి ఎపిక్ ముగింపుకు వచ్చిందా

బాహుబలి ఎపిక్ ముగింపుకు వచ్చిందా

రీ రిలీజుల్లో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన బాహుబలి ది ఎపిక్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు ట్రేడ్ టాక్. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి మిగిలిన చోట్ల మూడు రోజులు బాగా వసూళ్లు రాబట్టి సడన్ గా డౌన్ అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. రెండు భాగాలు ఒకేసారి చూడాలని ఎదురు చూసిన మూవీ లవర్స్ తమ కోరికను మూడు రోజుల్లోనే తీర్చేసుకున్నారు. చాలా చోట్ల శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ పడ్డాయి. మాస్ జాతర కన్నా మంచి నెంబర్లు బాహుబలి ఎపిక్ కే నమోదయ్యాయి. అయితే ఫ్యాన్స్ ఆశించింది, లెక్క వేసుకుంది వేరు.

కనీసం యాభై నుంచి వంద కోట్ల మధ్యలో ఫైనల్ గ్రాస్ నమోదవుతుందని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే అది నెరవేరడం సాధ్యపడేలా లేదు. ఎందుకంటే ఎంత ఎపిక్ అయినా కామన్ ఆడియన్స్ ఈ సినిమాని కొన్ని వందలసార్లు టీవీలో ఫోన్ లో చూసేశారు. ప్రతి ఒక్కరు మళ్ళీ ఎపిక్ కోసం థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. సో వంద కోట్లు అనేది చాలా పెద్ద మాట. బయ్యర్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ ముప్పై కోట్లు, ఓవర్సీస్ పది కోట్లు వసూలు చేసిన బాహుబలి ఎపిక్ ఇప్పటిదాకా నలభై కోట్లకు పైగా తన ఖాతాలో వేసుకున్నట్టు తెలిసింది. ఈ వారంలో హాఫ్ సెంచరీ మార్కు చేరుకుంటుందేమో చూడాలి.

కొన్ని చోట్ల మాత్రం బాహుబలి ఎపిక్ కి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ఉదాహరణకు ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం కాకుండానే ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ ఏఏఏ సముదాయంలో ఎల్ఈడి స్క్రీన్ లో వేస్తున్న షోలకు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. రవితేజ ఏఆర్టి ఎపిక్ స్క్రీన్ డిమాండ్ సైతం ఇదే స్థాయిలో ఉంది. అయితే ఏపీ తెలంగాణ మొత్తం ఇలాంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా బాహుబలి ఎపిక్ సరికొత్త రికార్డులు నమోదు చేసిన మాట వాస్తవం. దీని హడావిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 15 జరగబోయే ఎస్ఎస్ఎంబి 29 లాంచ్ వైపు వెళ్తోంది.

Related Post

నితిన్… ఇదీ వదిలేశాడా?నితిన్… ఇదీ వదిలేశాడా?

ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితుల్లో ‘ఇష్క్’ మూవీతో ఊపిరి పీల్చుకున్నాడు నితిన్.  ఆ తర్వాత అతను జాగ్రత్తగానే అడుగులు వేశాడు. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి విజయాలతో తన కెరీర్ బాగానే