hyderabadupdates.com movies బిగ్ బాస్ క్రేజ్ సినిమాల్లో ఉండదు బ్రో

బిగ్ బాస్ క్రేజ్ సినిమాల్లో ఉండదు బ్రో

బిగ్ బాష్ షో తెలుగులో ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ షోకు ఏటా భారీగా వ్యూయ‌ర్‌షిప్ వ‌స్తుంది. ఆ షో జ‌రిగిన‌న్ని రోజులు సోష‌ల్ మీడియాలో కూడా దాని గురించి బాగా హ‌డావుడి ఉంటుంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ల‌కు మంచి పాపులారిటీ వ‌స్తుంది. కానీ ఆ పాపులారిటీ వాళ్లు చేసే సినిమాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుందా అంటే మాత్రం ఔన‌ని చెప్ప‌లేం.

కౌశ‌ల్ మండ స‌హా బిగ్ బాస్ విన్న‌ర్లు, వేరే టాప్ కంటెస్టెంట్లు ఎవ్వ‌రూ కూడా సినిమాల్లో నిల‌దొక్కుకోలేక‌పోయారు. బిగ్ బాస్ పాపులారిటీ చూసుకుని వ‌రుస‌గా సినిమాలు ఒప్ప‌కున్న సోహెల్ సైతం ఎలా దెబ్బ తిన్నాడో తెలిసిందే. తాను హీరోగా న‌టించిన బూట్ క‌ట్ బాల‌రాజు సినిమాను థియేట‌ర్ల‌కు వ‌చ్చి జ‌నాలు చూడ‌ట్లేద‌ని సోహెల్ క‌న్నీళ్లు కూడా పెట్టుకోవ‌డం గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్‌లో త‌న‌కు ఓట్లు వేసిన వాళ్లంతా ఏమైపోయారంటూ అత‌ను ఆవేద‌న చెందాడు. కానీ దాని వ‌ల్ల ఫ‌లితం లేక‌పోయింది.

ఐతే ఇప్పుడు బిగ్ బాస్ పాపులారిటీ ద్వారా సుమ‌తీ శ‌త‌కం అనే సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకున్న అమ‌ర్ దీప్ మాత్రం.. సోహెల్ లాగా కాకుండా రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్‌లో ప‌డే ఓట్ల‌కు, సినిమాలు చూడ‌డానికి సంబంధం లేద‌ని అత‌ను తేల్చేశాడు. అదీ, ఇదీ వేర‌ని అత‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.

”బిగ్ బాస్‌లో ఓట్లు వేశారు క‌దా అని వాళ్లంతా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని ఆశించి మ‌నం సినిమాలు చేయ‌కూడ‌దు. నువ్వు ఏం చేయ‌గ‌ల‌వో నిరూపించుకుని వాళ్ల‌ను ర‌ప్పించుకోవాలి. అంతే త‌ప్ప ఆ ఓట్లు దీనికి ప‌నికి రావు. బిగ్ బాస్‌లో విన్న‌ర్ అయినా.. టాప్‌-5లో ఉన్నా అదంతా ఏక్ దిన్ కా రాజా అన్న‌ట్లే. ఆ ఒక్క రోజుకే అది ప‌రిమితం. ఆ త‌ర్వాత అంతా నార్మ‌లే.

ఈవెంట్లు చేసుకుంటూ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్తూ, స్టేజ్ షోలు చేసుకోవ‌డ‌మే. అక్క‌డ వ‌చ్చిన పేరును ఎలా ఉపయోగంచుకోవాల‌న్న‌ది మాత్రం తెలుసుకోవాలి. ఈ క్ర‌మంలో కొంచెం ఆల‌స్య‌మైనా స‌క్సెస్ మాత్రం వ‌స్తుంది. బిగ్ బాస్‌లో చేసిన వాళ్లంద‌రినీ హీరోల‌ను చేయాలంటే ఈ పాటికి ఆ లిస్ట్ చాలా పెద్ద‌ది అయ్యేది. ఆ షోలో మ‌న వ్య‌క్తిత్వం, అల‌వాట్లు, మాట‌లు చూసి మ‌నకు ఓట్లు వేస్తారంతే” అని తేల్చేశాడు అమ‌ర్ దీప్.

Related Post

సోష‌ల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారా??సోష‌ల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారా??

ఏపీ ప్ర‌భుత్వంపై నిత్యం సోష‌ల్ మీడియాలో విషం క‌క్కుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనిలో భాగంగా ఐదుగురు మంత్రుల‌తో కూడిన ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. వాస్త‌వానికి ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపిస్తూ.. సోష‌ల్ మీడియాలో

బాలయ్య గ్రీన్ మ్యాట్ పంచులు భేష్బాలయ్య గ్రీన్ మ్యాట్ పంచులు భేష్

అప్పుడప్పుడు అభిమానుల పట్ల కాస్త దూకుడుగా ఉన్నా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. ఒక్కోసారి మిస్ ఫైర్ అయినా సరే ఆయనేమి మొహమాటపడడు. తాజాగా ఇప్పటి హీరోల ధోరణి గురించి వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. తాను