hyderabadupdates.com movies బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నడూ ఈ రెండు ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించలేదు. కానీ, తాజాగా అసలు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రెండుసార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. లేదంటే ఎంఐఎంకు హైదరాబాద్ ను కాంగ్రెస్ ధారాదత్తం చేస్తుందని రామచందర్ రావు విమర్శించారు. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు లేదని, ఫ్యూచర్ తమదేనని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు. తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కాబట్టి ఈ క్లారిటీ ఇస్తున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

కుటుంబ పాలన కోసమా? కాళేశ్వరం కోసమా? దేనికి బీఆర్ఎస్ లో ఉండాలి అన్న భావన బీఆర్ఎస్ నేతల్లో వచ్చిందని, అందుకే బీఆర్ఎస్ నుండి బీజేపీకి వారు క్యూ కడుతున్నారని అన్నారు.

అందుకే, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, బీఆర్ఎస్ లోనే ఉండండి అని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్, కేటీఆర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తమ మందను కాపాడుకోవడం కోసం తండ్రికొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు.

Related Post

ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మార్చుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్లను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అప్‌డేట్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు: పవన్ కళ్యాణ్భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు: పవన్ కళ్యాణ్

వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వ్యవహరించిన తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని, కోట్ల మంది హిందువుల విశ్వాసాలను వమ్ము చేశారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ

వార్నింగ్ లతో పని మొదలెట్టిన కొత్త సీపీ సజ్జన్నార్వార్నింగ్ లతో పని మొదలెట్టిన కొత్త సీపీ సజ్జన్నార్

తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై