hyderabadupdates.com movies బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా వారిని పాలించే పాలకులు మాత్రం పచ్చి బూతులతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ‘కల్చర్’ తెలీని పశువులు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తెల్లోళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న పలువురు అమెరికా అధ్యక్షులు వ్యవహరించారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో తాను ఎంతలా హెచ్చరించినా.. బెదిరింపులకు దిగినా.. అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఇరాన్ తీరు ట్రంప్ లో అసహనం అంతకంతకూ పెంచేలా చేస్తోంది.

ఆదివారం అది కాస్తా బద్ధలైంది. ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ లో ఇరాన్ నాయకత్వాన్ని పచ్చి బూతులతో తిట్టేశారు. రాయలేని పదాల్ని వాడేసి.. హోర్మూజ్ జలసంధిని తెరవాలంటూ హుంకరించారు. లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుందంటూ మరో బండ బూతును వాడేశారు.

ఇలా వాడేసిన తీరు చూస్తే.. యుద్ధం విషయంలో ట్రంప్ ఎంత ఫస్ట్రేషన్ లో ఉన్నారో అర్థమవుతుంది. మొత్తంగా ఒప్పందం చేసుకోవటానికి తాను ఇచ్చిన గడువు ముగుస్తున్నా.. తాను అంచనా వేసినట్లుగా సానుకూల స్పందన రాకపోవటం ట్రంప్ కు ఎక్కడో కాలేలా చేసిందని చెప్పాలి. అందుకే ఆయన తన సోషల్ మీడియా వేదికగా చేసుకొని బండ బూతులతో చెలరేగిపోయారు.

ఇదంతా చూసినప్పుడు ట్రంప్ మాత్రమేనా.. బూతులు తిట్టే అమెరికా అధ్యక్షులు ఉన్నారా? అన్న సందేహం కొందరికి కలుగుతుంది. చరిత్రను చూస్తే.. విదేశీ ప్రతినిధులను.. విదేశీ పాలకులను తాము కోరుకున్నట్లుగా రియాక్టు కాకుంటే.. నోటికి వచ్చినట్లుగా తిట్టిపోసే ధోరణి అమెరికాలోని గత పాలకులకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాకుంటే.. గతంలో అధ్యక్షులుగా వ్యవహరించిన వారి నోటి దురద నాలుగు గోడలకు పరిమితం కావటం.. కాలక్రమంలో బయటకు వచ్చే అధికారిక టేపులు.. రికార్డుల కారణంగా వెలుగు చూసేవి. కొందరు అమెరికా అధ్యక్షులు మాత్రం మీడియా సమావేశాల్లోనో.. ఇతర కార్యక్రమాల్లో మాట అనేసేవారు.

మారిన కాలానికి.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీకి తగ్గట్లు సోషల్ మీడియా వేదికగా చేసుకొని పోస్టుల రూపంలో బూతులు తిట్టే క్రమానికి ట్రంప్ తెర తీశారని చెప్పాలి. గత చరిత్రను చూసినప్పుడు ట్రంప్ తాతలు మాదిరి వ్యవహరించిన అమెరికా అధ్యక్షులు కనిపిస్తారు. అలాంటి వారిలో కొందరిని చూస్తే..

లిండన్ బి.జాన్సన్అమెరికా అధ్యక్షుల్లో అత్యంత నోటి దురద ఉన్న అధినేతగా పేరుంది. అతడి భాష చాలా ముతకగా (నాటుగా) ఉండేది. తన రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టటంలో ఆయనకు సాటి వచ్చే వారే ఉండరు. ఇక.. తనకు నచ్చని దేశాధినేతలపై ఆయన ఒక రేంజ్ లో విరుచుకుపడేవారు. ఒకసారి వియత్నాం యుద్ధం గురించి మాట్లాడుతూ.. దారుణమైన పదజాలాన్ని వాడటం.. అది పెను సంచనలంగా మారింది.1964లో సైప్రస్ విషయంలో గ్రీస్ రాయబారి తమ మాట వినటం లేదన్న కోపంతో జాన్సన్ ఫోన్ లో అతడితో మాట్లాడుతూ.. ‘నీ పార్లమెంట్ ను.. నీ రాజ్యాంగాన్ని తగలేయ్. అమెరికా ఒక ఏనుగు. గ్రీస్ ఒక ఈగ. ఆ ఈగ.. ఏనుగును కుట్టాలని చూస్తే అది నలిగిపోతుంది’ అంటూ రాయలేని బండబూతులు తిట్టేశారు.

రిచర్డ్స్ నిక్సన్ఈ పెద్ద మనిషి అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అతడి ఆఫీసులో జరిగే ప్రతి మాటను రికార్డు చేసేవారు. వాటర్ గేట్ స్కాం సమయంలో బయటకు వచ్చిన టేపుల పుణ్యమా అని.. పలు సందర్భాల్లో అతను వాడిన బూతులకు అమెరికన్లు సైతం షాక్ తిన్న పరిస్థితి. ఆయన సంభాషణల్లో ఉండే బూతుల్ని రాయలేని పరిస్థితి. దీంతో.. బూతుల స్థానంలో ఆయన తొలగించిన పదాలుగా ప్రస్తావించేవారు. యూదులను ప్రత్యర్థులుగా ఆయన నోటికి వచ్చినట్లుగా బండ బూతులు తిట్టేవారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అత్యంత హీనంగా ముసలి మంత్రగత్తె అని.. భారతీయుల్ని దారుణమైన పదాలతో తిట్టేవాడు. ఇవన్నీ ఆ తర్వాతి కాలంలో బయటకు వచ్చాయి. అయితే.. దశాబ్దాల తర్వాతి అమెరికా అ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

హ్యారీ ఎస్. ట్రూమాన్తన కోపాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు బండ బూతులను అందుకునేవారు. రష్యా నాయకుల్ని ఆయన దారుణంగా తిట్టేసేవాడు. ఒప్పందాల్ని ఉల్లంఘించినట్లుగా తెలిసినప్పుడు వాడే భాష చాలా దారుణంగా ఉండేది.

జోబైడెన్సాధారణంగా మర్యాదగా మాట్లాడతారన్న పేరున్నా.. మైకులు ఆఫ్ లో ఉన్నప్పుడు అయ్యగారి అసలు స్వరూపం బయటకు వస్తుంది. మైక్ ఆఫ్ లో ఉందని భావించి బూతులు తిట్టేయటం.. అవి కాస్తా బయటకు రావటంతో ఆయనగారి తీరు అందరికి తెలిసేలా చేసింది.

ఇదంతా చూసినప్పుడు అమెరికా అధ్యక్షులుగా ఉండే వారి నోటి దురద ఎక్కువగా ఉండటమే కాదు.. అగ్రరాజ్యమన్న అహంకారం.. ప్రత్యర్థుల విషయంలో తాము ఎంత కఠినంగా ఉంటున్నామన్న విషయం ప్రజల్లో మరింత ఆదరణ పొందేలా చేస్తుందన్న ఉద్దశంతో పాటు.. మొరటుగా మాట్లాడే నాయకులను నిజాయితీపరులుగా నమ్ముతారన్న భావన కూడా ఉంటుంది.

Related Post

Rajinikanth and Kamal Haasan Unite for Historic Film #Thalaivar173Rajinikanth and Kamal Haasan Unite for Historic Film #Thalaivar173

Superstar Rajinikanth is set to create history once again with his next magnum opus #Thalaivar173, produced by Ulaganayagan Kamal Haasan’s Raaj Kamal Films International and directed by the blockbuster filmmaker

భారీ సక్సెస్ లేకున్నా లైనప్ లో 11 మంది దర్శకులుభారీ సక్సెస్ లేకున్నా లైనప్ లో 11 మంది దర్శకులు

సూర్య నటన గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కథలో దమ్ముంటే తను ఏ స్థాయిలో మెప్పిస్తాడో అందరికీ తెలిసిందే. కానీ బాక్సాఫీస్ దగ్గర అసలైన విజయం చూసి ఆయనకు చాలా కాలం అయ్యింది. 2013లో వచ్చిన ‘సింగం 2’ సినిమా