hyderabadupdates.com movies బైకర్… గట్టిగా కొట్టాలి సిక్సర్

బైకర్… గట్టిగా కొట్టాలి సిక్సర్

మార్చి నెలలో దురంధర్ ది రివెంజ్ కనక ఆదుకోకపోయి ఉంటే తెలుగు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి మరింత అన్యాయంగా ఉండేది. అద్భుతం చేస్తుందనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి వీకెండ్ తర్వాత చేతులు ఎత్తేయగా సర్ప్రైజ్ హిట్స్ అవుతాయేమోనని ఎదురు చూసిన బ్యాండ్ మేళం, హ్యాపీ రాజ్ లాంటివి ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ప్రమోషన్ల హడావిడితో ఏదో నెట్టుకొస్తున్నారు కానీ వీకెండ్ అవ్వగానే పరిస్థితి మరీ దారుణంగా మారిపోతోంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ ప్రారంభం కాబోతోంది. మూడో తేదీ శర్వానంద్ బైకర్ రంగంలోకి దిగుతోంది. దీని కోసం శర్వా చాలా కష్టపడ్డాడు. ఇరవై కేజీల బరువు తగ్గాడు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ని తండ్రి పాత్రకు ఒప్పించడంలో దర్శకుడు అభిలాష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ప్రొడక్షన్ పరంగా ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ యువి క్రియేషన్స్ బైకర్ కోసం భారీగా ఖర్చు పెట్టింది. డాల్బీ సినిమా, ఐమాక్స్ లాంటి అత్యాధునిక ఫార్మాట్స్ లో మూవీని రిలీజ్ చేస్తోంది.

ఇది కనక హిట్ అయితే తెలుగు బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. వేసవి ప్రారంభమయ్యాక సెలవు రోజుల్లో ఆక్యుపెన్సీలు తక్కువగా ఉండటం బయ్యర్లను ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ది, టాక్సిక్, ప్యారడైజ్ లాంటివి వాయిదా పడటం మరింత కలవరం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టయర్ 2 హీరోల కంటెంట్లు కనక ఆడియన్స్ ని మెప్పించగలిగితే ఎగ్జిబిటర్లకు ఎలాంటి ఆందోళన ఉండదు. కాకపోతే ఎక్స్ ట్రాడినరి టాక్ సొంతం చేసుకోవడం చాలా కీలకం అవుతుంది.

ఇక బైకర్ ముందు రెండు కాంపిటీషన్లు ఉన్నాయి. రాకాస కూడా అదే డేట్ కి వస్తోంది. నీహారిక కొణిదెల నిర్మాతగా సంగీత్ శోభన్ హీరోగా మానస వర్మ దర్శకత్వంలో కొంచెం ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. పూర్తిగా వేరే జానర్ కాబట్టి పోటీ పరంగా టెన్షన్ లేదు. ఇంకోవైపు ఐపీఎల్ మొదలయ్యింది. సాయంత్రం అయితే చాలు క్రికెట్ లవర్స్ టీవీలు, స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. వీళ్ళను డైవర్ట్ చేసి ఈవెనింగ్ షోలకు రప్పించాలంటే బైకర్ అదిరిపోవాలి. స్టేడియం బయటికి సిక్సర్ కొట్టాలి.

Related Post

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీమీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. “ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి. మీ క‌ష్టార్జితాన్ని వ‌దులుకోకండి“ అని ఆయ‌న `లింక్డ్ ఇన్‌`లో పోస్టు చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో స్పీడుగా ఉండే ప్ర‌ధాన‌మంత్రి.. తాజాగా

7 New Hollywood OTT Releases This Week: Just Alice, The Fantastic Four and More to Stream on Netflix and Disney+7 New Hollywood OTT Releases This Week: Just Alice, The Fantastic Four and More to Stream on Netflix and Disney+

Cast: Vanessa Kirby, Pedro Pascal, Joseph Quinn Director: Matt Shakman Language: English Genre: Superhero, Action Release Date: 5 November 2025 Streaming Platform: Disney+ JioHotstar After a successful theatrical run, Marvel’s