hyderabadupdates.com Gallery బ్యారేజ్ నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

బ్యారేజ్ నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

బ్యారేజ్ నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి post thumbnail image

హైద‌రాబాద్ : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశం జ‌రిగింది. తుమ్మ‌డిహ‌ట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ఎంత ఎత్తున నిర్మించాలి. ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా జరిగిందన్నారు. 71.5 కి.మీ మేరకు కెనాల్ వర్క్ జరిగిందని వివరించారు.
150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని సూచించారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలన్నిటిని సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించాలని నిపుణులు సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు.
ఈ బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీటిని అందించ వచ్చని, అలాగే, తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ర ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
The post బ్యారేజ్ నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటుఅంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు

అమరావతి : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అమరావతి : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36

త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే విజ‌యంత‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే విజ‌యం

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో మ‌రోసారి డీఎంకే ఇండియా కూట‌మి మ‌రోసారి విజ‌యం సాధించ‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా హూసూర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో