hyderabadupdates.com movies బ్రెయిన్ లేక హనుమాన్ ను వదులుకుంది

బ్రెయిన్ లేక హనుమాన్ ను వదులుకుంది

సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు ఆ పాత్రలకు సూట్ కారని పక్కన పెడుతుంటారు. ఇంకొన్నిసార్లు ఆర్టిస్టులే తమ దగ్గరికి వచ్చే పాత్రలకు నో చెబుతుంటారు. ఇలా ‘నో’ చెప్పిన పాత్రలు క్లిక్ అయితే, సదరు సినిమాలు భారీ విజయాలను అందుకుంటే మామూలు బాధ ఉండదు.

కెరీర్లే మారిపోయే పాత్రలను రిజెక్ట్ చేశామన్న అసంతృప్తి ఎప్పటికీ అలా ఉండిపోతుంది. తనకూ అలాంటి బాధ ఉందని అంటోంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

‘జాతిరత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్రతో మంచి గుర్తింపు సంపాదించిన ఫరియాకు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’లో తేజ సజ్జ సరసన నటించే అవకాశం వచ్చిందట. ఐతే ఆ సినిమాను తిరస్కరించడం తన కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పిదం అని అంటోంది ఫరియా.

‘జాతిరత్నాలు’ చిత్రంలో మంచి పేరు వచ్చాక.. అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టాను కాబట్టి తన వద్దకు వచ్చే పాత్రల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకున్నానని.. ఈ క్రమంలోనే ‘హనుమాన్’ సినిమాలో కథానాయిక పాత్రను తిరస్కరించానని ఫరియా చెప్పింది.

ఆ సమయంలో తనకు బ్రెయిన్ లేదని.. సరిగా ఆలోచించే శక్తి లేక.. హనుమాన్ సినిమా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోలేక ఆ పాత్రను వదులుకున్నానని ఆమె అంది. ఇప్పటికీ ఎక్కడైనా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిస్తే మీ సినిమా చేయలేకపోయాను అంటూ ఫీలవుతుంటానని ఫరియా చెప్పింది.

ఫరియా నో చెప్పడంతో ఆ అవకాశం తమిళ కథానాయిక అమృత అయ్యర్‌కు వెళ్లింది. కాకపోతే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయినా.. అమృతకేమీ పెద్దగా పేరు రాలేదు. తన కెరీర్లో గొప్ప మార్పేమీ కనిపించలేదు. ఒకవేళ ఫరియా నటిస్తే తన కెరీర్‌కు ఆ పాత్ర పెద్ద బూస్ట్ ఇచ్చేదేమో.2024 సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

Related Post

‘భర్త’ మహా ‘రాజు’లకు భలే వరం దొరికింది‘భర్త’ మహా ‘రాజు’లకు భలే వరం దొరికింది

ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తికి పది రోజుల పాటు హైక్స్ పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది.

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్ పెడితే చాలు ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. జగన్ నోటి నుంచి జాలువారే ఆణిముత్యాల కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే,