ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టైన ఆయన దాదాపు ఏడాది కాలంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పలు షరతులు విధిస్తూ ఉపశమనం కల్పించింది. ఈ నిర్ణయం కేసు తదుపరి దర్యాప్తు మరియు న్యాయపరమైన పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.